ఓటీటీలోకి వణికించే హారర్ థ్రిల్లర్.. భయపెట్టే అద్దం.. రియల్ స్టోరీతో.. రూ.4065 కోట్ల కలెక్షన్లు.. రికార్డుల మోత-horror thriller the conjuring last rites ott release date movie will be streaming on prime video from october 7th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి వణికించే హారర్ థ్రిల్లర్.. భయపెట్టే అద్దం.. రియల్ స్టోరీతో.. రూ.4065 కోట్ల కలెక్షన్లు.. రికార్డుల మోత

ఓటీటీలోకి వణికించే హారర్ థ్రిల్లర్.. భయపెట్టే అద్దం.. రియల్ స్టోరీతో.. రూ.4065 కోట్ల కలెక్షన్లు.. రికార్డుల మోత

ఓటీటీలోకి వణికించే హారర్ థ్రిల్లర్ సినిమా రాబోతుంది. ప్రపంచంలో పాపులర్ అయిన హారర్ సిరీస్ కాంజురింగ్ లో భాగంగా తెరకెక్కిన తొమ్మిదో సినిమా ఇది. బాక్సాఫీస్ ను షేక్ చేసిన మూవీ ఇప్పుడు ఓటీటీలో అదరగొట్టబోతుంది.

ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ (x)

హాలీవుడ్ హారర్ థ్రిల్లర్లు అంటేనే వేరే లెవల్. ఇక అందులోనూ ది కాంజురింగ్ సిరీస్ కు మరింత స్పెషాలిటీ ఉంది. ఈ సినిమాను ఆడియన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. భయంతో చంపేస్తాయి. ఇప్పుడు ఈ సిరీస్ లోని తొమ్మిదో సినిమా ‘ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్’ ఓటీటీలోకి రాబోతుంది. ఆడియన్స్ ను భయపెట్టేంత థ్రిల్ అందించడానికి డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.

ది కాంజురింగ్ ఓటీటీ

ది కాంజురింగ్ ఫ్రాంఛైజీలోని సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. హారర్ థ్రిల్లర్లకు ఇవి ఒక బెంచ్ మార్క్ లాంటివి. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. అక్టోబర్ 7 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

ఏ ఓటీటీలో?

రీసెంట్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్ మూవీ ఓటీటీలోకి దూసుకొస్తుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. మంగళవారం నుంచి ఈ ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. కానీ రెంట్ విధానంలో మాత్రమే ఇప్పుడు ఈ మూవీని చూసేందుకు అవకాశం ఉంటుంది. పే చేసి మాత్రమే చూడొచ్చు.

బ్లాక్ బస్టర్ హారర్

ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్ మూవీ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ గా నిలిచింది. సెప్టెంబర్ 5, 2025న ఈ సినిమా రిలీజైంది. ఫస్ట్ డే నుంచి బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. ఇండియాలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన అమెరికన్ హారర్ థ్రిల్లర్ గా నిలిచింది. మొత్తం రూ.4065 కోట్ల కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఈ హారర్ ఫ్రాంఛైజీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా ఇదే.

రూ.488 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన సినిమా ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్. దీనికి మైకెల్ చావ్స్ డైరెక్టర్. స్మర్ల్ హంటింగ్ కేస్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో వెర ఫార్మింగా, పాట్రిక్ విల్సన్, మియా, బెన్ తదితరులు నటించారు.

ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్ కథ

ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్ మూవీ ఓ సూపర్ నేచురల్ హారర్ సినిమా. 1964లో ఎడ్, వారెన్ ఓ మిర్రర్ తో కూడిన హంటింగ్ కేసును ఎంక్వైరీ చేస్తారు. ఆ మిర్రర్ లో వారెన్ తన భవిష్యత్ ను, బిడ్డ పుట్టకపోవడాన్ని చూస్తుంది. కానీ ఆ బిడ్డ పుడుతుంది. ఆమెకు జ్యూడీ అనే పేరు పెడతారు.

22 ఏళ్ల తర్వాత ఆ అద్దం జ్యూడీని వెంటాడుతూనే ఉంటుంది. ఆ అద్దాన్ని పగలగొట్టేస్తారు. అయినా ఓ పెద్దావిడ, ఓ అమ్మాయి, గొడ్డలితో ఉన్న ఓ పురుషుడు వెంటపడుతూనే ఉంటారు. మరి చివరకు ఏం జరిగిందో మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం