ఒకే ఓటీటీలోకి ఒకే వారం వచ్చిన రెండు హారర్ థ్రిల్లర్ సినిమాలు.. తెలుగులో స్ట్రీమింగ్.. ఎక్కడంటే..-horror thriller movies guardian and the akaali in telugu dubbing streaming on aha ott hansika film ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఒకే ఓటీటీలోకి ఒకే వారం వచ్చిన రెండు హారర్ థ్రిల్లర్ సినిమాలు.. తెలుగులో స్ట్రీమింగ్.. ఎక్కడంటే..

ఒకే ఓటీటీలోకి ఒకే వారం వచ్చిన రెండు హారర్ థ్రిల్లర్ సినిమాలు.. తెలుగులో స్ట్రీమింగ్.. ఎక్కడంటే..

ఈవారం తెలుగులో ఒకే ఓటీటీలో రెండు హారర్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. అయితే, ఈ రెండు డబ్బింగ్ చిత్రాలే. ఈ సినిమాలు ఏవో.. ఎక్కడ చూడొచ్చనే విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

ఒకే ఓటీటీలోకి ఒకే వారం వచ్చిన రెండు హారర్ థ్రిల్లర్ సినిమాలు.. తెలుగులో స్ట్రీమింగ్.. ఎక్కడంటే..

రెండు తమిళ సినిమాలు తెలుగు డబ్బింగ్‍లో ఒకే వారం ఓటీటీలోకి వచ్చాయి. రెండూ హారర్ థ్రిల్లర్ జానర్‌లోనే ఉన్నాయి. హన్సిక లీడ్ రోల్ చేసిన గార్డియన్ సినిమా ఇందులో ఒకటి. తమిళంలో థియేటర్లలో విడుదలైన ఏడాది తర్వాత తెలుగు డబ్బింగ్‍లో ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. మరో హారర్ థ్రిల్లర్ కూడా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఒకే ఓటీటీలోకి తాజాగా వచ్చిన రెండు హారర్ థ్రిల్లర్ సినిమాల వివరాలు ఇవే..

గార్డియన్

గార్డియన్ చిత్రం తెలుగు డబ్బింగ్‍లో ఈ వారం ఏప్రిల్ 24వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హన్సిక లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం తమిళంలో గతేడాది మార్చిలో విడుదలైంది. ఏడాది తర్వాత ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ అయి ఆహా ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఓ పాపను ప్రమాదాల నుంచి రక్షించేందుకు ఓ దెయ్యం చేసే ప్రయత్నాల చుట్టూ ఈ గార్డియన్ మూవీ స్టోరీ సాగుతుంది.

గార్డియన్ మూవీకి గురు శరవణన్, శబరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హన్సికతో పాటు సురేశ్ చంద్రమీనన్, సిమ్రన్, శ్రీమాన్, రాజేంద్రన్, ప్రదీప్ బెనెటో, తంగదురై కీలకపాత్రలు పోషించారు.

గార్డియన్ మూవీని బ్లాక్‍బస్టర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ చంద్ర ప్రొడ్యూజ్ చేశారు. సామ్ సీఎస్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రానికి తమిళ థియేట్రికల్ రిలీజ్‍లో మిక్స్డ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కూడా నిరాశ ఎదురైంది. ఇప్పుడు తెలుగులో ఆహాలో గార్డియన్ చిత్రాన్ని చూడొచ్చు.

ది అకాలి

ది అకాలి సినిమా తెలుగు వెర్షన్ ఏప్రిల్ 26న ఆహా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ హారర్ థ్రిల్లర్ సినిమా గతేడాది మే 31వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు సుమారు 11 నెలలకు తెలుగు డబ్బింగ్‍లో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో నాజర్, తలైవాసల్ విజయ్, జయకుమార్ జానకీరామన్, వినోద్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించారు.

ది అకాలి చిత్రానికి మహమ్మద్ ఆసిఫ్ హమీద్ దర్శకత్వం వహించారు. వరుస చావులు, అతీత శక్తులు, వీటి వెనుక మిస్టరీతో ఈ చిత్రం సాగుతుంది. ఈ మూవీని ఉకేశ్‍రావన్ ప్రభు నిర్మించగా.. ఆనిశ్ మోహన్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి గిరి మర్పీ సినిమాటోగ్రఫీ చేశారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం