Horror Thriller Movie: టీవీలోకి వస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం.. పండుగ రోజున టెలికాస్ట్.. ఏ ఛానెల్‍లో అంటే..
Demonte Colony 2 Horror Thriller Movie: డిమోంటి కాలనీ 2 చిత్రం తెలుగు వెర్షన్ టీవీ ప్రీమియర్‌కు రెడీ అయింది. ఈ సినిమా టెలికాస్ట్ డేట్, టైమ్ ఖరారయ్యాయి. పండుగ సందర్భంగా ఈ చిత్రం టీవీలోకి వస్తోంది.
డిమోంటి కాలనీ 2 చిత్రం సక్సెస్ సాధించింది. అరుళ్‍నిథి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ ఈ హారర్ థ్రిల్లర్ మంచి అంచనాలతో వచ్చి మెప్పించింది. తమిళంలో ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ కాగా.. తెలుగులో ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుక వచ్చింది. రెండు భాషల్లోనూ మంచి కలెక్షన్లను సాధించింది ఈ సీక్వెల్ మూవీ. ఇప్పుడు డిమోంటి కాలనీ 2 సినిమా తెలుగు వెర్షన్ టీవీలోకి స్పెషల్ డే రోజున వస్తోంది.
టెలికాస్ట్ వివరాలు ఇవే
డిమోంటి కాలనీ 2 మూవీ అక్టోబర్ 31వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని జీ తెలుగు తొలిసారి టెలికాస్ట్ చేయనుంది. ఈ విషయాన్ని జీ తెలుగు వెల్లడించింది. అక్టోబర్ 31 గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ మూవీ ప్రీమియర్ అవుతుందని పేర్కొంది.
ఓటీటీలో ఎక్కడ?
డిమోంటి కాలనీ 2 చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళం, తెలుగులో అడుగుపెట్టింది. ఈ మూవీకి ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. కొన్ని రోజులు జీ5 ట్రెండింగ్‍లో టాప్‍లో నిలిచింది ఈ చిత్రం. మంచి వ్యూస్ సాధించింది. ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
డిమోంటి కాలనీ 2 చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. 2015లో వచ్చిన సూపర్ హిట్ సాధించిన డిమోంటి కాలనీకి సీక్వెల్‍గా తొమ్మిదేళ్ల తర్వాత ఈ చిత్రం వచ్చింది. మొదటి నుంచి పాజిటివ్ టాక్ రావటంతో భారీ కలెక్షన్లను ఈ చిత్రం సాధించింది. తెలుగు వెర్షన్ కోసం కూడా మూవీ టీమ్ బాగానే ప్రమోషన్లు చేసింది. తెలుగులోనూ మంచి వసూళ్లనే ఈ చిత్రం దక్కించుకుంది.
డిమోంటి కాలనీ 2 కలెక్షన్లు
డిమోంటి కాలనీ 2 మూవీ సుమారు రూ.60కోట్ల గ్రాస్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. దాదాపు రూ.15కోట్ల బడ్జెట్‍తో ఈ మూవీ రూపొందింది. భారీ కలెక్షన్లు దక్కించుకొని బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సూపర్ హిట్‍గా నిలిచింది. చిన్న మూవీగా వచ్చి మంచి విజయం సాధించింది.
డిమోంటి కాలనీ 2 చిత్రంలో అరుళ్‍నిధి, ప్రియాతో పాటు అర్చన్ రవీంద్రన్, అరుణ్ పాండియన్, అంట్టి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, ముత్తుకుమార్ కీరోల్స్ చేశారు. బీటీజీ యూనివర్సల్, వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‍మెంట్, జ్ఞానముత్తు పట్టారై పతాకాలపై బాబీ బాలచంద్రన్, విజయ్ సుబ్రమణియం, ఆర్సీ రాజ్‍కుమార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. సామ్ సీఎస్ ఈ మూవీకి సంగీతం అందించారు.
డబుల్ ఇస్మార్ట్ నేడే
రామ్ పోతినేని హీరోగా నటించిన మాస్ యాక్షన్ మూవీ డబుల్ ఇస్మార్ట్ చిత్రం నేడే (అక్టోబర్ 27) జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. నేటి సాయంత్రం 6 గంటలకు ఈ మూవీ టెలికాస్ట్ అవుతుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ సెప్టెంబర్ మొదట్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చింది. నేడు జీ తెలుగు ఛానెల్‍లో డబుల్ ఇస్మార్ట్ ప్రీమియర్ కానుంది.