ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. సస్పెన్స్‌తో ఊపేసే మూవీ.. రెండు భాషల్లో స్ట్రీమింగ్‍కు..-horror suspense thriller movie wolf man streaming started on jiohotstar ott in english and hindi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. సస్పెన్స్‌తో ఊపేసే మూవీ.. రెండు భాషల్లో స్ట్రీమింగ్‍కు..

ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. సస్పెన్స్‌తో ఊపేసే మూవీ.. రెండు భాషల్లో స్ట్రీమింగ్‍కు..

ఉల్ఫ్ మ్యాన్ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. రెండు భాషల్లో ఈ హారర్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. రెంట్ లేకుండా సాధారణ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.

ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. సస్పెన్స్‌తో ఊపేసే మూవీ.. రెండు భాషల్లో స్ట్రీమింగ్‍

హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ సినిమా ‘ఉల్ఫ్ మ్యాన్’ మోస్తరు హిట్ సాధించింది. లీ వానెల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో క్రిస్టఫర్ అబాట్, జూలియా గార్నర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఏడాది జనవరి 17వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే కొన్ని ఓటీటీల్లో రెంటల్ విధానంలో వచ్చింది. అయితే, రెంట్ లేకుండా రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు నేడు (మే 17) ఈ సినిమా ఓటీటీలో అడుగుపెట్టింది.

రెండు భాషల్లో.. స్ట్రీమింగ్ వివరాలివే

ఉల్ఫ్ మ్యాన్ సినిమా నేడు జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇంగ్లిష్‍తో పాటు హిందీ డబ్బింగ్‍లోనూ ఎంట్రీ ఇచ్చింది. రెండు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.

రెంట్ లేకుండా..

ఉల్ఫ్ మ్యాన్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో సహా మరిన్ని ప్లాట్‍ఫామ్‍ల్లో రెంటల్ పద్ధతిలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇప్పుడు జియోహాట్‍స్టార్ ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అంటే హాట్‍స్టార్ సబ్‍స్క్రిప్షన్ ఉన్న వారు రెంట్ లేకుండానే సాధారణంగా ఈ హారర్ చిత్రాన్ని వీక్షించుకొచ్చు. థియేటర్లలో రిలీజైన నాలుగు నెలలకు ఈ మూవీ రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చింది.

సస్పెన్స్‌తో థ్రిల్లింగ్‍గా..

ఉల్ఫ్ మ్యాన్ సినిమా థ్రిల్లింగ్‍గా సాగుతుంది. వింత జీవులు దాడి చేసేందుకు రావడం, తన భార్య, కూతురిని రక్షించుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించడం చుట్టూ సాగుతుంది. అయితే, సడెన్‍గా ఆ వ్యక్తే ప్రమాదకరంగా మారతాడు. ఇదే భారీ ట్విస్టుగా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ మూవీలో ఆసక్తికరంగా సాగుతుంది. ఈ ఉల్ఫ్ మ్యాన్ మూవీ ఉత్కంఠతో ఊపేస్తుంది. ఈ చిత్రాన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్లు, మలుపులతో తెరకెక్కించారు డైరెక్టర్ వానెల్.

ఉల్ఫ్ మ్యాన్ చిత్రం థియేట్రికల్ రిలీజ్‍లో మిక్స్డ్ టాక్ దక్కించుకున్నా.. మంచి కలెక్షన్లనే రాబట్టింది. 25 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ మూవీ.. దాదాపు 35 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది.

ఉల్ఫ్ మ్యాన్ చిత్రానికి బెంజిమన్ వాల్‍ఫిష్ మ్యూజిక్ అందించగా.. స్టెఫాన్ డుసియో సినిమాటోగ్రఫీ చేశారు. ఈ సినిమాను బ్లూమ్‍హౌస్ ప్రొడక్షన్స్, క్లాక్ అండ్ కో పతాకాలు ప్రొడ్యూజ్ చేశాయి. జేసన్ బ్లూమ్ నిర్మాతగా వ్యవహరించారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం