Horror Movie OTT: హారర్ సినిమాల్లో దెయ్యాలు వెంటాడి చంపడం మనం చూశాం. అలాంటి హారర్ సినిమాలు చూస్తూ భయంతో వణికిపోయి చనిపోయిన వాళ్లనూ చూశాం. కానీ ఓ హారర్ సినిమా తీసిన ఆరుగురు నటీనటులు ప్రొడక్షన్ సమయంలోనో, ఆ తర్వాతో చనిపోవడం ఎక్కడైనా విన్నారా? 1982లో హాలీవుడ్ లో వచ్చిన పోల్టర్‌గైస్ట్ మూవీ చేసిన మేకర్స్ కు ఈ అనూహ్య ఘటనలు ఎదురయ్యాయి.
హారర్ మూవీ సెట్స్ లోనే హారర్ కనిపించింది ఈ పోల్టర్‌గైస్ట్ మూవీ మేకర్స్‌కి. ప్రముఖ దర్శకుడు స్టీఫెన్ స్పీల్‌బెర్గ్ స్క్రీన్‌ప్లే అందించిన ఈ సినిమాను టోబీ హూపర్ డైరెక్ట్ చేశాడు. ఓ ఫ్యామిలీ నివసిస్తున్న ఇంటిపై దెయ్యాలు దాడి చేసి వాళ్ల కూతురిని ఎత్తుకుపోయే స్టోరీతో ఈ మూవీ తెరకెక్కింది. అయితే ఆ దెయ్యం శాపంతోనే ఈ సినిమాలో నటించిన ఆరుగురు నటీనటులు చనిపోయారన్న పుకార్లు షాక్‌కు గురిచేశాయి.
ఈ పోల్టర్‌గైస్ట్ మూవీ క్లైమ్యాక్స్ లో ఇందులో తల్లి డయానా పాత్ర పోషించిన జోబెత్ విలియమ్స్.. అస్త పంజరాలు ఉన్న ఓ చెరువులోకి దూకుతుంది. అయితే అందులోని స్కెలిటన్లు సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేసినవి కావు. అని నిజమైన మనుషుల అస్తి పంజరాలు కావడం గమనార్హం. దీని వల్లే ఈ మూవీ చేసిన వారికి శాపం తగిలినట్లు చెప్పేవారు. నిజానికి అవి నిజమైన అస్తి పంజరాలను జోబెత్ కు చాలా కాలం తర్వాత తెలియడం ఇక్కడ మరో విశేషం.
పోల్టర్‌గైస్ట్ హారర్ మూవీ తీస్తున్న సమయంలో, ఆ మూవీ రిలీజ్ తర్వాత కొన్నాళ్లకే ఇందులో పని చేసిన నలుగురు చనిపోయారు. ఈ సినిమాలో లీడ్ యాక్టర్స్ పెద్ద కూతురిగా నటించిన డొమెనిక్ డూన్ ను 1982 నవంబర్ లో ఆమె బాయ్‌ఫ్రెండ్ చంపేశాడు. ఇక చిన్న కూతురుగా నటించిన హీథర్ ఓరూర్కీ కొన్నేళ్ల తర్వాత 12 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో చనిపోయింది.
ఇక ఈ సినిమాలో పని చేసిన మరో వ్యక్తి లూ పెర్రీమాన్ 2009లో హత్యకు గురయ్యాడు. ఇక ఈ సినిమాలో మాంత్రికుడిగా చేసిన జూలియన్ బెక్ 1987లో క్యాన్సర్ తో చనిపోయాడు. ఇక ఇదే పోల్టర్‌గైస్ట్ 2 మూవీలో నటించిన విల్ సాంప్సన్ కూడా ఏడాది తర్వాత కిడ్నీలు విఫలం కావడంతో కన్ను మూశాడు. మూవీ సెట్స్ లో దెయ్యం ఉందంటూ, అతడు ఆ దెయ్యాన్ని తరిమేయడానికి ప్రత్యేకంగా అక్కడ పూజలు కూడా చేయించాడు. అయినా ఆ వెంటనే అతడు కన్నుమూయడం గమనార్హం.
ఈ హారర్ మూవీ పోల్టర్‌గైస్ట్ ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను చూడొచ్చు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోనూ ఈ సినిమా ఉంది. మరి ఆరుగురు ప్రాణాలను బలి తీసుకున్న ఈ హారర్ సినిమాను మీరు కూడా ఓటీటీలో చూసి కాస్త భయపడండి.