ఓటీటీలోకి ఐదు నెలల తర్వాత వస్తున్న రూ.1500 కోట్ల వసూళ్ల హారర్ మూవీ.. భయపడటానికి రెడీగా ఉండండి-horror movie nosferatu ott release date jiohotstar ott to stream the movie from 10th may ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి ఐదు నెలల తర్వాత వస్తున్న రూ.1500 కోట్ల వసూళ్ల హారర్ మూవీ.. భయపడటానికి రెడీగా ఉండండి

ఓటీటీలోకి ఐదు నెలల తర్వాత వస్తున్న రూ.1500 కోట్ల వసూళ్ల హారర్ మూవీ.. భయపడటానికి రెడీగా ఉండండి

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి ఇప్పుడో హారర్ మూవీ వస్తోంది. థియేటర్లలో రిలీజైన సుమారు ఐదు నెలల తర్వాత ఇప్పుడు ఇండియన్ ప్రేక్షకుల కోసం రాబోతోంది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.1500 కోట్లు వసూలు చేసిన సినిమా ఇది.

ఓటీటీలోకి ఐదు నెలల తర్వాత వస్తున్న రూ.1500 కోట్ల వసూళ్ల హారర్ మూవీ.. భయపడటానికి రెడీగా ఉండండి

హారర్ మూవీ అభిమానులా మీరు? అయితే ఇప్పుడు ఓటీటీలోకి రాబోతున్న ఈ హారర్ సినిమాను మిస్ కాకుండా చూడండి. గతేడాది క్రిస్మస్ సందర్భంగా రిలీజై ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకుపైగా వసూలు చేసిన సినిమా ఇది. కొన్నాళ్లుగా వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో రెంట్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ మూవీ.. ఇప్పుడు జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి రానుంది.

నోస్ఫెరాటు ఓటీటీ రిలీజ్ డేట్

ఓటీటీలోకి వస్తున్న హారర్ మూవీ పేరు నోస్ఫెరాటు (Nosferatu). ఈ సినిమా మే 10 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గతేడాది డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. రాబర్ట్ ఎగర్స్ డైరెక్ట్ చేసిన ఈ నోస్ఫెరాటు సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ సాధించింది.

రూ.420 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తే.. రూ.1500 కోట్లు వసూలు చేసింది. బిల్ స్కార్స్‌గార్డ్, లిలీ రోజ్ డెప్, నికోలస్ హౌల్ట్, ఆరోన్ టేలర్ జాన్సన్, ఎమ్మా కోరిన్, రాల్ఫ్ ఇనేసన్ లాంటి వాళ్లు నటించారు.

నోస్ఫెరాటు మూవీ గురించి..

1922లో వచ్చిన నోస్ఫెరాటు: ఎ సింఫనీ ఆఫ్ హారర్ అనే సైలెంట్ మూవీకి ఈ తాజా నోస్ఫెరాటు ఓ ఆధునిక రూపం. ఈ సినిమా ఎలెన్ హట్లర్ (డెప్) అనే ఓ యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమెకు నిద్రలో చిత్రవిచిత్రమైన భయంకర రూపాలు కనిపిస్తుంటాయి. కౌంట్ ఓర్లోక్ అనే ఓ పిశాచి ఆమెపై మనసు పారేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ మూవీ స్టోరీ.

రాబర్ట్ ఎగర్స్ డైరెక్ట్ చేసిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఈ నోస్ఫెరాటు నిలిచింది. నాలుగు కేటగిరీల్లో ఆస్కార్స్ నామినేషన్లు కూడా అందుకున్న సినిమా ఇది. అద్భుతమైన ఫొటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, కౌంట్ ఒర్లోక్ అనే పిశాచిగా బిల్ స్కార్స్‌గార్డ్ నటన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు తెచ్చిపెట్టింది.

ఈ నోస్ఫెరాటు మూవీ కొన్నాళ్లుగా జీ5, ప్రైమ్ వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడీ మూవీ మే 10 నుంచి జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్లందరికీ ఫ్రీగా చూసే అవకాశం రానుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం