OTT Horror Crime Thriller Web Series: ఓటీటీలో ఎక్కువ మంది చూసిన తమిళ హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ..-horror crime thriller web series inspector rishi most watched tamil series streaming on prime video in telugu also ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror Crime Thriller Web Series: ఓటీటీలో ఎక్కువ మంది చూసిన తమిళ హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ..

OTT Horror Crime Thriller Web Series: ఓటీటీలో ఎక్కువ మంది చూసిన తమిళ హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ..

Hari Prasad S HT Telugu

OTT Horror Crime Thriller Web Series: ఓటీటీలో హారర్, క్రైమ్ థ్రిల్లర్ జానర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. మరి ఈ రెండు జానర్లు కలిపి వచ్చిన తమిళ వెబ్ సిరీస్.. ఆ భాషలో ఎక్కువ మంది చూసిన సిరీస్ గా నిలిచింది. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మీరు చూశారా?

ఓటీటీలో ఎక్కువ మంది చూసిన తమిళ హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ..

OTT Horror Crime Thriller Web Series: అమెజాన్ ప్రైమ్ వీడియోలో గతేడాది వచ్చిన హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇన్‌స్పెక్టర్ రిషి. ఇది తమిళంలో అత్యధిక మంది చూసిన వెబ్ సిరీస్ గా నిలిచింది. ఐఎండీబీలో 7.2 రేటింగ్ సాధించిన ఈ హారర్ వెబ్ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఒకవేళ మీరు చూసి ఉండకపోతే.. వెంటనే చూసేయండి.

ఇన్‌స్పెక్టర్ రిషి.. ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్

ప్రముఖ నటుడు నవీన్ చంద్ర నటించిన వెబ్ సిరీస్ ఇన్‌స్పెక్టర్ రిషి. ఇదొక తమిళ హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయినా.. తెలుగు, హిందీలాంటి ఇతర భాషల్లోనూ వచ్చింది. ఈ జానర్లో అత్యధిక మంది చూసిన తమిళ వెబ్ సిరీస్ ఇదే.

ఇందులో నవీన్ చంద్రతోపాటు సునయన, కన్నా రవి, మాలిని జీవరత్నం, కుమారవేల్, మిషా ఘోషాల్ లాంటి వాళ్లు నటించారు. ఈ సిరీస్ గతేడాది ఓటీటీలోకి రాగా.. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళంలో అయితే ఎగబడి చూశారు. ఏకంగా ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ గా నిలిచింది.

ఇన్‌స్పెక్టర్ రిషి కథేంటంటే?

ఒకే తీరులో హత్యలు జరగడం.. వాటి వెనుక అదృశ్య శక్తి ఉందని అందరూ నమ్మడం.. ఆ హత్య కేసులను ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్లు ప్రయత్నించడం.. ఇలాంటి స్టోరీ లైన్‍తో ఇప్పటికే కొన్ని సినిమాలు, సిరీస్‍లు వచ్చాయి. ఇన్‍స్పెక్టర్ రిషి కూడా ఇదే కోవలోకి వస్తుంది.

అయితే, ఈ సిరీస్‍లో క్రైమ్ థ్రిల్లర్‌కు హారర్ కూడా తోడైంది. ఈ సిరీస్ చాలా వరకు గ్రిప్పింగ్‍గా ఉంటూ ఎంగేజ్ చేస్తుంది. జానర్లు ఎక్కువగా ఉన్నా.. ఈ సిరీస్ సమతూకంతో ఉంటుంది. అన్ని అంశాలు సమపాల్లలో ఉండేలా మేకర్స్ జాగ్రత్త పడ్డారు.

ఇన్‍స్పెక్టర్ రిషి కథను పకడ్బందీగా రాసుకున్న డైరెక్టర్ నందినీ ఎస్‍జే.. దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. ప్రతీ ఎపిసోడ్‍కు లింక్ కూడా అర్థవంతంగా ఉండేలా రూపొందించారు. నరేషన్ ఎక్కువగా పక్కదోవ పట్టకుండా జాగ్రత్త పడ్డారు. ఓ పూజ తర్వాత కొందరు సామూహికంగా ఆత్మహత్య చేసుకునే సీక్వెన్స్‌తో ఈ సిరీస్ మొదలవుతుంది.

ఆ తర్వాత కొన్నేళ్లకు అదే ప్రాంతంలో హత్యలు జరుగుతాయి. వీటిని రిషి, అతడి టీమ్ దర్యాప్తు చేయడం మొదలుపెడుతుంది. అక్కడి నుంచి ఇదే ట్రాక్‍లో సిరీస్ నడుస్తుంది. అయితే, రిషితో పాటు వారి టీమ్‍లోని ఇద్దరి వ్యక్తిగత జీవితం గురించి మధ్యమధ్యలో సీన్లు ఉన్నా.. మరీ ఎక్కువ కాకుండా వాటిని కూడా ఆసక్తికరంగానే మేకర్స్ చూపించారు. రిషిని వెంటాడే గతం కూడా ఇంట్రెస్టింగ్‍గానే ఉంటుంది.

సంబంధిత కథనం