Horror Movie on OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో హారర్ కామెడీ మూవీ.. మోషన్ పోస్టర్ రిలీజ్
Horror Movie on OTT: ఓటీటీలోకి మరో హారర్ కామెడీ మూవీ నేరుగా వచ్చేస్తోంది. ఈమధ్యే థియేటర్లలో రిలీజైన సంచలన విజయం సాధించిన ముంజ్యా మూవీ డైరెక్టరే ఈ కొత్త సినిమా తీస్తుండటం విశేషం.

Horror Movie on OTT: హారర్ కామెడీ జానర్ మూవీస్ కి ఓటీటీల్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఈ మధ్యకాలంలో యువ దర్శకులు ఇలాంటి జానర్ సినిమాలు తీయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈమధ్యే బాలీవుడ్ లో వచ్చిన ముంజ్యా మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో మనకు తెలుసు. ఇప్పుడదే డైరెక్టర్ నుంచి వస్తున్న మరో హారర్ కామెడీ నేరుగా ఓటీటీలోకే రానుండటం విశేషం.
జీ5 ఓటీటీలోకి కాకుడా
బాలీవుడ్ లో ఈ మధ్యే వచ్చిన మూవీ ముంజ్యా ఓ హారర్ కామెడీ. ఈ సినిమా జూన్ 7న రిలీజైన బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఇప్పటికే ఇండియాలోనే రూ.60 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. అసలు ఎవరి అంచనాలకు అందకుండా దూసుకెళ్తున్న మూవీ ఇది. ఈ సినిమాను మరాఠీ డైరెక్టర్ ఆదిత్య సర్పోదర్ తెరకెక్కించాడు. ఇప్పుడా డైరెక్టరే కాకుడా అనే మరో హారర్ మూవీ తీస్తున్నాడు.
అయితే ముంజ్యా మూవీ థియేటర్లలో ఇంతటి సంచలన విజయం సాధించినా.. తన నెక్ట్స్ మూవీని మాత్రం ఈ డైరెక్టర్ నేరుగా ఓటీటీలోకే తీసుకొస్తుండటం విశేషం. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను కూడా జీ5 ఓటీటీ రిలీజ్ చేసింది. ఈ సినిమాకు కాకుడా అనే టైటిల్ పెట్టారు. ఈ మూవీ పోస్టర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది.
"కాకుడా వచ్చే సమయం అయింది. మంగళవారం సాయంత్రం 7.15 గంటలకు తలుపు తీయడం మరచిపోకండి. ఎందుకంటే ఈసారి ప్రతి మగాడు ప్రమాదంలో ఉన్నాడు. కాకుడా త్వరలోనే కేవలం జీ5లో.." అనే క్యాప్షన్ తో జీ5 ఓటీటీలో ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ కాకుడా సినిమాలో సోనాక్షి సిన్హా, రితేష్ దేశ్‌ముఖ్ లాంటి బాలీవుడ్ ప్రముఖ నటులు నటిస్తున్నారు.
కాకుడా మూవీ గురించి..
కాకుడా మోషన్ పోస్టర్ చూస్తే.. మొదట్లోనే ఓ ఊళ్లో క్లాక్ టవర్, దాని ముందున్న వీధిని చూపిస్తారు. ఆ వీధిలో ఓ నీడ కనిపిస్తుంది. తర్వాత ఓ ఇంటి తలుపు ఎవరో బాదుతున్నట్లు వినిపిస్తుంది. సడెన్ గా డోరు తెరుచుకుంటుంది. పైనుంచి ఓ దెయ్యం కిందికి వేలాడుతున్నట్లుగా చూపించారు. అయితే కాళ్ల వరకే చూపించే ఆపేశారు. ఈ పోస్టర్ తోనే సరికొత్త కాన్సెప్ట్ తో మూవీ రాబోతున్నట్లు అర్థమవుతోంది.
కాకుడా మూవీ జీ5 ఒరిజినల్ గా వస్తోంది. ఈ సినిమాను ఆదిత్య సర్పోదర్ డైరెక్ట్ చేస్తుండగా.. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ముంజ్యా మూవీ బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేస్తున్న హల్చల్ చూస్తుంటే.. రిలీజ్ కు ముందే ఈ కాకుడాపై హైప్ మరో రేంజ్ లో ఉంది. ఇక ముంజ్యా మూవీ జులై చివరి వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతానికి మంజ్యా ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ, త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో అభయ్ వర్మ, శర్వారీ వాఘ్ నటించారు.