OTT Horror Movie: ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న హారర్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?-horror comedy movie kakuda to stream in zee5 ott from july 12th sonakshi sinha ritesh deshmukh ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror Movie: ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న హారర్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?

OTT Horror Movie: ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న హారర్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Jun 21, 2024 05:49 PM IST

OTT Horror Movie: మరో హారర్ కామెడీ మూవీ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ శుక్రవారం (జూన్ 21) రివీల్ చేశారు. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఇందులో నటించింది.

ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న హారర్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న హారర్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?

OTT Horror Movie: హారర్ కామెడీ జానర్లో మరో మూవీ ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటీనటులు సోనాక్షి సిన్హా, రితేష్ దేశ్‌ముఖ్ నటించిన కాకుడా (Kakuda) అనే మూవీ స్ట్రీమింగ్ డేట్ ను శుక్రవారం (జూన్ 21) వెల్లడించారు. ఈ మధ్యే ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా.. త్వరలోనే రిలీజ్ కాబోతోందని జీ5 ఓటీటీ తెలిపింది. తాజాగా ఆ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

కాకుడా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్

సోనాక్షి సిన్హాలాంటి నటి ఉన్నా కూడా ఈ కాకుడా సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి తీసుకురాబోతున్నారు. జీ5 (ZEE5) ఓటీటీలో ఈ మూవీ జులై 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ ద్వారా జీ5 వెల్లడించింది.

"పురుషుల హితం కోసం జారీ చేసిన ప్రకటన.. జులై 12కు కాకుడా వస్తోంది.. అందుకే ఇంట్లోనే ఉండండి.. అంతేకాదు సరిగ్గా సాయంత్రం 7.15 గంటలకు మీ ఇంటి తలుపు తెరిచి ఉంచడం మరచిపోకండి. ఎందుకంటే ఇప్పుడు మగవాళ్లు ప్రమాదంలో ఉన్నారు. కాకుడా కేవలం మీ జీ5లోను.." అనే క్యాప్షన్ తో ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది.

ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఇందులో సోనాక్షి, రితేష్ దేశ్‌ముఖ్ భయంభయంగా కనిపించారు. ఇదో విచిత్రమైన భయపెట్టే కామెడీ మూవీ అని ఆ పోస్టర్ పై రాయడం విశేషం. ఈ సినిమాను మరాఠీ డైరెక్టర్ ఆదిత్య సర్పోదార్ డైరెక్ట్ చేశాడు. రోనీ స్క్రూవాలా నిర్మించాడు.

ముంజ్యా డైరెక్టర్ నుంచే..

బాలీవుడ్ లో ఈ మధ్యే వచ్చిన మూవీ ముంజ్యా ఓ హారర్ కామెడీ. ఈ సినిమా జూన్ 7న రిలీజైన బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఇప్పటికే ఇండియాలోనే రూ.60 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. అసలు ఎవరి అంచనాలకు అందకుండా దూసుకెళ్తున్న మూవీ ఇది. ఈ సినిమాను మరాఠీ డైరెక్టర్ ఆదిత్య సర్పోదర్ తెరకెక్కించాడు. ఇప్పుడా డైరెక్టరే కాకుడా అనే మరో హారర్ మూవీ తీస్తున్నాడు.

అయితే ముంజ్యా మూవీ థియేటర్లలో ఇంతటి సంచలన విజయం సాధించినా.. తన నెక్ట్స్ మూవీని మాత్రం ఈ డైరెక్టర్ నేరుగా ఓటీటీలోకే తీసుకొస్తుండటం విశేషం. కాకుడా మోషన్ పోస్టర్ చూస్తే.. మొదట్లోనే ఓ ఊళ్లో క్లాక్ టవర్, దాని ముందున్న వీధిని చూపిస్తారు. ఆ వీధిలో ఓ నీడ కనిపిస్తుంది. తర్వాత ఓ ఇంటి తలుపు ఎవరో బాదుతున్నట్లు వినిపిస్తుంది. సడెన్ గా డోరు తెరుచుకుంటుంది. పైనుంచి ఓ దెయ్యం కిందికి వేలాడుతున్నట్లుగా చూపించారు. అయితే కాళ్ల వరకే చూపించే ఆపేశారు. ఈ పోస్టర్ తోనే సరికొత్త కాన్సెప్ట్ తో మూవీ రాబోతున్నట్లు అర్థమవుతోంది.

ప్రస్తుతం ముంజ్యా మూవీ బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేస్తున్న హల్చల్ చూస్తుంటే.. రిలీజ్ కు ముందే ఈ కాకుడాపై హైప్ మరో రేంజ్ లో ఉంది. ఇక ముంజ్యా మూవీ జులై చివరి వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Whats_app_banner