Kalki 2898 AD Video Song: కల్కి 2898 ఏడీ నుంచి మరో వీడియో సాంగ్ రిలీజ్: చూసేయండి
Kalki 2898 AD Video Song: కల్కి 2898 ఏడీ సినిమా నుంచి మరో వీడియో సాంగ్ రిలీజ్ అయింది. హోప్ ఆఫ్ శంబాల వీడియో సాంగ్‍ను మూవీ టీమ్ తీసుకొచ్చింది.

సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీ కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ కంటిన్యూ చేస్తోంది. జూన్ 27వ తేదీన రిలీజైన ఈ మూవీ తొలి వారం కలెక్షన్ల వర్షం కురిపించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం భారీ సక్సెస్ అవుతోంది. ఇంకా వసూళ్లలో జోరు చూపిస్తోంది. ఈ తరుణంలో నేడు (జూలై 4) కల్కి 2898 ఏడీ సినిమా నుంచి మరో వీడియో సాంగ్‍ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది.
శంబాల పాట
కల్కి 2898 ఏడీ మూవీ నుంచి హోప్ ఆఫ్ శంబాల వీడియో సాంగ్ నేడు రిలీజ్ అయింది. ఈ వీడియో సాంగ్‍ను యూట్యూబ్‍లోకి తీసుకొచ్చింది మూవీ టీమ్. ఈ మూవీలో గర్భిణిగా ఉండే దీపికా పదుకొణ్ శంబాలకు వచ్చినప్పుడు ఈ పాట ఉంటుంది. కైరా చనిపోయిన సందర్భంగా ఈ ఎమోషనల్ సాంగ్ వస్తుంది. తమకు ఇంకా ఆశ ఉందంటూ శంబాల ప్రజలు పాడుకునే పాటగా ఇది ఉంది.
కల్కి 2898 ఏడీ చిత్రంలో హోప్ ఆఫ్ శంబాల పాటకు ఇంటెన్స్ ట్యూన్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ సంతోశ్ నారాయణన్. ఈ పాటను శోభన చంద్రకుమార్ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి మంచి సాహిత్యంతో లిరిక్స్ అందించారు. ఈ చిత్రంలో ఈ పాట ఎమోషనల్‍గా సాగుతుంది. ఇప్పుడు ఈ వీడియో సాంగ్‍ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది.
ఇటీవలే కల్కి మూవీలో ఫుల్ జోష్‍తో ఉండే ‘టా టక్కర’ సాంగ్‍ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ పాట చాలా వైరల్ అయింది. ముఖ్యంగా హీరో ప్రభాస్ స్టెప్‍లు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలోని కాంప్లెక్స్‌ను చూపించే ఈ సాంగ్ గ్రాండ్‍గా ఉంది.
కల్కి తొలి వారం కలెక్షన్లు
కల్కి 2898 ఏడీ సినిమా తొలి వారం ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.725 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ప్రభాస్ హీరోగా చేసిన గత మూవీ సలార్ వసూళ్లను కల్కి ఏడు రోజుల్లోనే దాటేసింది. రూ.1,000 కోట్ల మార్క్ దిశగా ఈ చిత్రం దూసుకెళుతోంది.
ఈ తరంలో అతిపెద్ద బాక్సాఫీస్ స్టార్ అంటూ ప్రభాస్ ఫొటోను పోస్ట్ చేసి ఇటీవలే ట్వీట్ చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రభాస్ వల్లే ఈ స్థాయిలో భారీ కలెక్షన్లు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. తాను ఈ చిత్రం ఇంత బాగా తీసుకొచ్చేందుకు ప్రొడక్షన్‍కు ప్రభాస్ ఆత్మవిశ్వాసం ఇచ్చారని, ఏం చేయాలో చేసేందుకు తమకు స్వేచ్ఛ ఇచ్చారని నాగ్ అశ్విన్ తెలిపారు. ప్రభాస్ ఇచ్చిన చాలా సలహాలు ఈ మూవీకి ఎంతో ఉపయోగపడ్డాయని నాగీ పేర్కొన్నారు.
కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ దీపికా పదుకొణ్ మెయిన్ రోల్స్ చేశారు. మహాభారతం ఆధారంగా సైన్స్ ఫిక్షన్ మూవీగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‍తో నిర్మించింది వైజయంతీ మూవీస్. ఈ చిత్రానికి సుమారు రూ.600కోట్ల వరకు బడ్జెట్ ఖర్చయిందని అంచనా.