Hollywood Movie OTT Streaming: థియేటర్లో వసూళ్ల వర్షం కురిపించిన తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన ఈ లేటెస్ట్ మూవీ థియేటర్లలో మే 10న రిలీజ్ కాగా.. ఇప్పుడు రెండున్నర నెలల తర్వాత ఓటీటీలో అడుగుపెట్టబోతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ మూవీ మంచి ఆదరణ పొందింది. మూవీలో నటీనటుల నటనతోపాటు విజువల్ ఎఫెక్ట్స్, స్టోరీ, డైరెక్షన్ ను ప్రేక్షకులు కొనియాడారు. రెండు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించి ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైనా సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా ఆగస్ట్ 2 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇంగ్లిష్ తోపాటు హిందీ, తెలుగు, తమిళం భాషల్లోనూ కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ మూవీ స్ట్రీమింగ్ కానుండటం విశేషం. 2017లో వచ్చిన వార్ ఫర్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ మూవీకి సీక్వెల్ గా వచ్చిందీ మూవీ. 1968లో తొలిసారిగా మొదలైన ఈ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన పదో సినిమా ఇది. ఆ వార్ ఫర్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ మూవీకి కొన్ని వందల ఏళ్ల తర్వాత జరిగిన స్టోరీగా ఈ కొత్త సినిమాను తెరకెక్కించారు.
ఈ కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ లో ఇదీ ఒకటి. 160 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా మొత్తంగా 392 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. ఐఎండీబీలో ఈ సినిమాకు 7.2 రేటింగ్ లభించింది.
మొదటి షో నుంచే వచ్చిన పాజిటివ్ రివ్యూలతో సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల రెంట్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఆగస్ట్ 2 నుంచి హాట్‌స్టార్ సబ్ స్క్రైబర్లందరికీ అందుబాటులోకి రానుంది. డిజిటల్ ప్రీమియర్ తర్వాత ఆగస్ట్ 27న ఈ సినిమా 4కే అల్ట్రా హెచ్‌డీ, బ్లూరే, డీవీడీ ఫార్మాట్లలోనూ రిలీజ్ కానుంది.
నిజానికి జులై 9 నుంచే ఈ సినిమా ఇండియాలో ఆపిల్ టీవీ ప్లస్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ యాక్షన్ సై-ఫి మూవీని చూడాలంటే రూ.590 చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు హాట్‌స్టార్ లో ఫ్రీగా అందుబాటులోకి వస్తుండటంతో ఆపిల్ టీవీ ఈ మూవీ స్ట్రీమింగ్ కొనసాగిస్తుందా లేదా చూడాలి.