ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తున్న సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. వణికించేలా సాగే సినిమా ఇది.. ఎప్పుడంటే..-hollywood horror thriller nosferatu will be regular streaming on jiohotstrar ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తున్న సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. వణికించేలా సాగే సినిమా ఇది.. ఎప్పుడంటే..

ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తున్న సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. వణికించేలా సాగే సినిమా ఇది.. ఎప్పుడంటే..

నొస్‍ఫెరటు సినిమా ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే రెంటల్ విధానంగా ఈ చిత్రం అందుబాటులో ఉంది. అయితే, రెంట్ లేకుండా సాధారణ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. డేట్ ఖరారైంది.

ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తున్న సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. వణికించేలా సాగే సినిమా ఇది

హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ చిత్రం నొస్‍ఫెరటు (Nosferatu) సూపర్ హిట్ సాధించింది. రాబర్ట్ ఎగ్గర్స్ దర్శకత్వం వహించిన ఈ గోథిక్ హారర్ థ్రిల్లర్ సినిమా బాక్సాఫీస్ సక్సెస్ కొట్టింది. లిలీ రోజ్ డెప్, బిల్ స్కార్స్ గార్డ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ 2024 డిసెంబర్ 24న విడుదలైంది. కొన్ని ఓటీటీల్లో ఇప్పటికే రెంటల్ విధానంలో అడుగుపెట్టింది. అయితే, రెంట్ లేకుండా రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు ఇప్పుడు సిద్ధమైంది.

రెగ్యులర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

నొస్‍ఫెరటు సినిమా మే 10వ తేదీన జియో హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రం ఇప్పటికే జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రెంట్ చెల్లించి చూసేలా అందుబాటులోకి వచ్చింది. అయితే, హాట్‍స్టార్ ఓటీటీలో రెంట్ లేకుండా చేసేలా రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు మే 10న అడుగుపెట్టనుంది. దీంతో జియో హాట్‍స్టార్ సబ్‍స్క్రైబర్లు ఈ మూవీని ఫ్రీగా చూసేయవచ్చు.

నొస్‍ఫెరటు కలెక్షన్లు

నొస్‍ఫెరటు సినిమా 50 మిలియన్ డాలర్ల బడ్డెట్‍తో రూపొందింది. ఈ చిత్రం సుమారు 181.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,547 కోట్లు) కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్, రివ్యూలు దక్కాయి. బాక్సాఫీస్ వద్ద కూడా బాగా పర్ఫార్మ్ చేసింది. దీంతో కమర్షియల్ సక్సెస్ దక్కించుకుంది.

ఓ యువతి, రక్త పిచాచి చుట్టూ..

నొస్‍ఫెరటు సినిమా స్టోరీ దెయ్యం పట్టిన ఓ యువతి, ఓ రక్తపిచాచి చుట్టూ సాగుతుంది. భయపెట్టేలా హారర్ ఎలిమెంట్లతో ఈ చిత్రం ఉంటుంది. థ్రిల్లింగ్ నరేషన్‍తో ఈ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ రాబర్ట్ ఎగ్గర్స్. ఈ సినిమాలో లిలీ రోజ్ డెప్, బిల్ స్కార్స్ గార్డ్ సహా నికోలస్ హాల్ట్, ఆరోన్ టేలర్ జాన్సన్, విలెమ్ డఫోయ్, ఎమ్మా కోరిన్, రాల్ఫ్ ఇన్సన్, సైమన్ మెక్‍బర్నీ కీలకపాత్రలు పోషించారు.

నొస్‍ఫెరటు మూవీని మెయిడిన్ వోయేజ్ పిక్సర్స్, బిర్చ్ హిర్ రోడ్ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకాలపై జెఫ్ రాబిన్‍రోవ్, జాన్ గ్రహమ్, క్రిస్ కోలంబస్, ఎలెనోర్ కొలంబస్, రాబర్ట్ ఎగ్గర్స్ ప్రొడ్యూజ్ చేశారు. రాబిన్ కరోలన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జరీన్ బ్లష్కే సినిమాటోగ్రఫీ చేశారు. ఈ మూవీని మే 10 నుంచి జియో హాట్‍స్టార్ ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍తో చూడొచ్చు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం