OTT Horror: ట్విస్ట్‌లతో వణికించే హాలీవుడ్ హారర్ మూవీ - ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి
OTT Horror: హాలీవుడ్ హారర్ మూవీ ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్ ఓటీటీలోకి వచ్చింది. గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ది ఎగ్జార్సిస్ట్ ఫ్రాంఛైజ్‌లో ఆరవ మూవీగా వచ్చిన ఈ హారర్ సినిమా థియేటర్లలో 11 వందల కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

OTT Horror: హాలీవుడ్ హారర్ మూవీ ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్ థియేటర్లలో రిలీజైన ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చింది. గురువారం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజైంది. ఇప్పటికే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ఓటీటీ, ఆపిల్ టీవీలో అందుబాటులో ఉంది. ఈ ఓటీటీలలో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోండగా నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం ఫ్రీ స్ట్రీమింగ్ రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
30 మిలియన్ల బడ్జెట్...
ఈ హారర్ మూవీలో లేస్టీ ఓడోమ్, ఓలివియా ఓనిల్, లిడ్యా జెవెట్ కీలక పాత్రలు పోషించారు. డేవిడ్ గోర్డన్ గ్రీన్ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 2023లో ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్ మూవీ థియేటర్లలో రిలీజైంది. 30 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 137 మిలియన్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇండియన్ కరెన్సీలో 11 వందల కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నది. కాన్సెప్ట్ విషయంలో సినిమాపై నెగెటివ్ టాక్ వచ్చింది. విమర్శలతో సంబంధం లేకుండా భారీగా వసూళ్లను రాబట్టింది.
ఆరవ మూవీ...
ఎగ్జార్సిస్ట్ ఫ్రాంఛైజ్‌లో ఇది ఆరవ మూవీ కావడం గమనార్హం. 1973లో రిలీజైన ది ఎగ్జార్సిస్ట్ మూవీతో ఈ ఫ్రాంఛైజ్ మొదలైంది. హాలీవుడ్ హారర్ మూవీస్ ఫ్రాంఛైజ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్‌గా ది ఎగ్జార్సిస్ట్ నిలిచింది. ఈ ఫ్రాంఛైజ్‌లో ఐదో మూవీ అయినా డొమినియన్ 2005లో రూపొందింది. దాదాపు 18 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఆరో మూవీగా ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్ మూవీ తెరకెక్కింది.
ఫొటోగ్రాఫర్ కథ...
విక్టర్ ఓ ఫొటోగ్రాఫర్. భార్య దూరం కావడంతో కూతురు ఏంజెలా ప్రపంచంగా బతుకుతుంటాడు. ఏంజెలాతో పాటు ఆమె స్నేహితురాలు కేథరిన్‌ను దయ్యం ఆవహిస్తుంది. కూతురి ప్రాణాలు కాపాడుకోవడం కోసం విక్టర్ ఏం చేశాడు? ఆ దయ్యంతో విక్టర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఆ దయ్యం ఏంజెలా, కేథరిన్‌లను ఎందుకు అవహించింది అనే అంశాలతో దర్శకుడు డేవడ్ గ్రీన్ ఈ మూవీని తెరకెక్కించాడు.
హారర్ ఎలిమెంట్స్...
కథ పాతదే అయినా హారర్ ఎలిమెంట్స్ మాత్రం ప్రేక్షకులను భయపెట్టాయి. కొన్ని ట్విస్ట్‌లు కూడా ఆకట్టుకున్నాయి. 1973లో రిలీజైన ది ఎగ్జార్సిస్ట్‌లోని పలు పాత్రలను రిఫరెన్స్‌గా తీసుకుంటూ ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్ కథను మేకర్స్ డెవలప్ చేశారు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ పదికిగాను 4.8 రేటింగ్‌ను మాత్రమే సొంతం చేసుకున్నది. ది ఎగ్జార్సిస్ట్ ఫ్రాంఛైజ్‌లో ఏడో మూవీ కూడా రాబోతుంది.