New Year Re-Releases: న్యూఇయర్‌కు మూడు తెలుగు సినిమాలు రీ-రిలీజ్.. మెగాస్టార్ ఓల్డ్ హిట్, రాజమౌళి మూవీతో పాటు మరొకటి
New Year Re-Release movies: న్యూయర్ సందర్భంగా మూడు తెలుగు సినిమాలు థియేటర్లలో రీ-రిలీజ్ కానున్నాయి. గతంలో ప్రేక్షకులను అలరించిన చిత్రాలు మళ్లీ థియేటర్లలో అడుగుపెట్టనున్నాయి. ఆ సినిమాలు ఏవంటే..
కొత్త సంవత్సరం 2025 సమీపిస్తోంది. మరొక్క వారంలో 2024 ముగియనుంది. ఈ తరుణంలో న్యూఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఇప్పటికే చాలా మంది ప్లాన్ చేస్తుంటారు. ఆ రోజున సినిమాలు చూసేందుకు కూడా కొందరు ఆలోచిస్తుంటారు. ఈ తరుణంలో న్యూఇయర్ సందర్భంగా 2025 జనవరి 1వ తేదీన మూడు తెలుగు సినిమాలు రీ-రిలీజ్ కానున్నాయి. ప్రేక్షకులను సిల్వర్ స్క్రీన్‍పై మరోసారి అలరించేందుకు రెడీ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఓల్డ్ హిట్ మూవీ కూడా ఇందులో ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
సై
దర్శక ధీరుడు రాజమౌళి మూడో సినిమా 'సై' కూడా కొత్త సంవ్సరం సందర్భంగా 2025 జనవరి 1న మరోసారి థియేటర్లలో అడుగుపెట్టనుంది. నితిన్, జెనీలియా హీరోహీరోయిన్లుగా 2004లో వచ్చిన ఈ సై చిత్రం బ్లాక్‍బస్టర్ అయింది. కాలేజ్ యూత్, రక్బీ బ్యాక్‍డ్రాప్‍లోఈ మూవీని రాజమౌళి తెరకెక్కించారు. అప్పట్లో సై చిత్రం సూపర్ హిట్ అయింది.
సై సినిమాను శ్రీభవానీ ఎంటర్‌ప్రైజెస్ నిర్మించగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. నితిన్ జెనీలియాతో పాటు శశాంక్, ప్రదీప్ రావత్, రాజీవ్ కనకాల, నాజర్, చత్రపతి శేఖర్, అజయ్, తనికెళ్ల భరణి, వేణు మాధవ్ ఈ మూవీలో కీరోల్స్ చేశారు. ఇప్పుడు సుమారు 21 ఏళ్ల తర్వాత సై చిత్రం మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. మరి కొత్త సంవత్సరం రోజున రీ-రిలీజ్‍లో ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
హిట్లర్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో హిట్లర్ ఓ స్పెషల్ మూవీగా నిలిచింది. ఐదుగురు చెల్లెళ్లను ప్రేమగా చూసుకుంటూ, వారి కష్టాలను తీర్చే అన్నగా ఈ చిత్రంలో చిరూ నటించారు. హిట్లర్ చిత్రం 1997 జనవరిలో రిలీజై మంచి హిట్ కొట్టింది. ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. చిరంజీవి సరసన రంభ హీరోయిన్‍గా నటించారు. రాజేంద్ర ప్రసాద్, దాసరి నారాయణ రావు, రామిరెడ్డి కీలకపాత్రలు పోషించారు. హిట్లర్ చిత్రం 27 ఏళ్ల తర్వాత ఇప్పుడు 2025 జనవరి 1న థియేటర్లలోక రీ-రిలీజ్ అవుతోంది. ఇప్పటికే టికెట్ల బుకింగ్స్ కూడా కొన్ని చోట్ల మొదలైపోయాయి.
ఓయ్
సిద్ధార్థ్, షామిలీ హీరోహీరోయిన్లగా నటించిన 'ఓయ్' ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. 2009లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో కమర్షియల్‍గా పెద్ద సక్సెస్ కాలేకపోయింది. అయితే, ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ మూవీ ఆ తర్వాత ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. టీవీలు, డిజిటల్ ప్లాట్‍ఫామ్‍ల్లో ఈ మూవీకి చాలా ఆదరణ దక్కింది. ఇప్పటికీ ఓయ్ చిత్రాన్ని చాలా మంది చూస్తూనే ఉంటారు.
న్యూయర్ సందర్భంగా జనవరి 1వ తేదీన ఓయ్ సినిమా కూడా థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. గతంలోనే ఓసారి ఈ చిత్రం రీ-రిలీజ్ అయింది. ఇప్పుడు మరోసారి థియేటర్లలోకి వస్తోంది. ఈ మూవీకి ఆనంద్ రంగ దర్శకత్వం వహించారు. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఈ మూవీ కోసం అందించిన పాటలు క్లాసిక్‍లుగా నిలిచిపోయాయి. ఇప్పటీ వినిపిస్తూనే ఉంటాయి. ఫీల్ గుడ్ సీన్లు, స్టోరీ, కామెడీ, పాటలు, సిద్ధార్థ్ - షామిలీ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి హైలెట్స్‌గా నిలిచాయి.