ఓటీటీలోకి ఇవాళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వచ్చేసింది. సాధారణంగా సూపర్ హిట్ అయిన సినిమాలు నెల దాటిన తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. కానీ, ఈ మూవీ మాత్రం రూ. 120 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నప్పటికీ నెల రోజులు కాకముందే ఓటీటీ రిలీజ్ అయిపోయింది.
ఆ సినిమానే నేచురల్ స్టార్ నాని హీరోగా చేసిన హిట్ 3. డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమాగా హిట్ ది థర్డ్ కేస్ వచ్చింది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ అయినప్పటి నుంచి అంచనాలు పెరిగిపోయాయి. దాంతో సినిమా కోసం ఎంతగానే ఆడియెన్స్ ఎదురుచూశారు. అనుకున్నట్లుగానే మే 1న థియేటర్లలో హిట్ 3 విడుదలైంది.
సుమారు రూ. 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హిట్ 3 మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 120 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి 10కి 7.4 రేటింగ్ తెచ్చుకుంది. ఇక ఫ్రెష్ కంటెంట్ ఎంతో చెప్పే రొట్టెన్ టొమాటోస్ అయితే 71 శాతం తాజా కంటెంట్ అని సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక హిట్ 3 మూవీలోని సీన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌కు తెలుగు ఆడియెన్స్ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది.
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కాస్తా సెకండాఫ్‌లో సర్వైవల్ థ్రిల్లర్‌గా మారిందని హిట్ 3పై రివ్యూలు వచ్చాయి. అయితే, దానిపై మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. హిట్ 3లో అర్జున్ సర్కార్‌గా నాని అదరగొట్టాడని ప్రశంసలు వచ్చాయి. అర్జున్ సర్కార్ క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన విధానం చాలా బాగుందన టాక్ వినిపించింది.
ఇలా ఎన్నో పాజిటివ్స్ తెచ్చుకున్న హిట్ 3 ఇవాళ (మే 29) ఓటీటీ రిలీజ్ అయింది. సుమారు 29 రోజుల్లో అంటే నెల కాకుండానే హిట్ 3 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో హిట్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ వంటి ఐదు భాషల్లో హిట్ 3 ఓటీటీ రిలీజ్ అయింది.
దీంతోపాటు స్పెషల్ అట్రాక్షన్‌గా హిట్ 3 మూవీ 4కె డాల్బీ విజన్ వీడియో, డాల్బీ అట్మాస్ ఆడియో వెర్షన్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. ఇది ఓటీటీ ఆడియెన్స్‌కు మంచి ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. కాగా, హిట్ 3 మూవీలో కన్నడ బ్యూటి, కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది.
మృదుల పాత్రలో శ్రీనిధి శెట్టి సైతం బాగా అలరించనది టాక్ వినిపించింది. నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మాతలుగా వ్యవహరించిన హిట్ ది థర్డ్ కేస్ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. అలాగే, హిట్ 3 చిత్రంలో సూర్య శ్రీనివాస్, అదిల్ పాలా, రవి మరియా, రావు రమేష్, బ్రహ్మాజీ, ఆదర్శ్ బాలకృష్ణ ఇతర కీలక పాత్రలు పోషించారు.
అడివి శేష్, విశ్వక్ సేన్, తమిళ స్టార్ హీరో కార్తీ హిట్ 3 మూవీలో స్పెషల్ కెమియోలతో అలరించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన హిట్ 3 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి.
సంబంధిత కథనం