హీరో నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది హిట్ 3 మూవీ. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఈ సూపర్ హిట్ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
హిట్ 3 ఓటీటీ హక్కులను ఫ్యాన్సీ రేటుకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత సినిమాను స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలతో ఓటీటీ ప్లాట్‌ఫామ్ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ డీల్ ప్రకారం హిట్ 3 జూన్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జూన్ ఫస్ట్ వీక్‌లోనే ఓటీటీ విడుదల తేదీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు చెబుతోన్నారు.
హిట్ 3 మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీతోనే శ్రీనిధి శెట్టి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రావురమేష్, ప్రతీక్ బబ్బర్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. అడివిశేష్‌తో పాటు తమిళనటుడు కార్తి అతిథి పాత్రల్లో మెరిశారు. హీరోగా నటిస్తూనే ప్రశాంతి తిపిరినేనితో కలిసి నాని ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు.
హిట్ 3 రికార్డ్ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. 13 రోజుల్లో 114 కోట్ల వరకు గ్రాస్, అరవై కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. నిర్మాతలకు పది కోట్లకుపైగా లాభాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం.
అర్జున్ సర్కార్ (నాని) ఓ పోలీస్ ఆఫీసర్. దేశంలో ఒకే తరహాలో జరిగిన పదమూడు హత్యలకు సంబంధించిన కేసు ఇన్వేస్టిగేషన్‌ను అర్జున్ చేపడతాడు. ఈ హత్యల వెనుక సీటీకే అనే డార్క్ వెబ్‌సైట్ ఉందని అర్జున్‌కు తెలుస్తుంది. అసలు సీటీకే ఏంటి? ఈ వెబ్‌సైట్ వెనుక ఎవరున్నారు? సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన అర్జున్ సర్కార్ హత్య చేస్తూ వర్ష అనే పోలీస్ ఆఫీసర్‌కు ఎలా దొరికిపోయాడు? మృదులతో అర్జున్ ప్రేమాయణం సాఫీగా సాగిందా? లేదా? సైకో కిల్లర్స్‌ను అర్జున్ పట్టుకున్నాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
హిట్ ఫ్రాంచైజ్‌కు కొనసాగింపుగా నాలుగో మూవీ కూడా రాబోతుంది. ఈ నాలుగో భాగంలో కార్తి హీరోగా కనిపించబోతున్నాడు. హిట్ లో విశ్వక్‌సేన్ హీరోగా నటించగా...హిట్ 2లో అడివిశేష్ కనిపించాడు.
హిట్ 3 తర్వాత నాని ది పారడైజ్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాకు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
సంబంధిత కథనం