బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో టాలీవుడ్‌లో మినిమం గ్యారెంటీ హీరోగా పేరుతెచ్చుకున్నాడు నాని. హాయ్ నాన్న, సరిపోదా శనివారం బ్లాక్‌బస్టర్ తర్వాత నాని హీరోగా నటిస్తోన్న హిట్ 3పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. నాని కెరీర్‌లోనే మోస్ట్ వయలెంట్ మూవీగా హిట్ 3 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇటీవల రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. హిట్ 3 ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్లు సమాచారం. యాభై కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో హిట్ 3 రిలీజ్ అవుతోన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఆంధ్రా ఏరియాలో 15 కోట్లు, నైజాంలో 13 కోట్ల వరకు నాని మూవీ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.
ఓవర్‌సీస్‌లో 10 కోట్లు, సీడెడ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో కలిపి మరో 11 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు చెబుతోన్నారు. వరల్డ్ వైడ్‌గా 49 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది. యాభై కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజ్ అవుతోన్నట్లు చెబుతోన్నారు. నాని సినీ కెరీర్‌లో హయ్యెస్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అవుతోన్న మూవీగా హిట్ 3 నిలిచింది.
ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో హిట్ 3తో పాటు సూర్య రెట్రో కూడా నిలిచింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో మాత్రం హిట్ 3దే జోరు కనిపిస్తోంది. నాని మూవీకి సూర్య రెట్రో ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోతుంది. రిలీజ్‌కు మరో రెండు రోజులు ముండే హిట్ 3 అడ్వాన్స్ బుకింగ్స్ కోటి డెబ్బై లక్షల వరకు జరిగాయి. రెట్రో అడ్వాన్స్ బుకింగ్స్ నలభై లక్షల లోపే ఉన్నట్లు సమాచారం.
హిట్ ఫ్రాంచైజ్‌లో మూడో మూవీగా హిట్ 3 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. హిట్ 3 మూవీలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీతోనే శ్రీనిధి శెట్టి టాలీవుడ్‌లో కి ఎంట్రీ ఇస్తోంది. హిట్ 3 మూవీలో కోలీవుడ్ హీరో కార్తీతో పాటు అడివిశేష్ గెస్ట్ రోల్స్‌లో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మే 1న హిట్ 3 రిలీజ్ కాబోతోంది.
హిట్ 3 తర్వాత దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ది పారడైజ్ మూవీ చేయబోతున్నాడు నాని. రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవలే రిలీజైన కోర్ట్ మూవీతో నిర్మాతగాను నాని పెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రియదర్శి, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ యాభై కోట్ల వసూళ్లను రాబట్టింది.
సంబంధిత కథనం