హిట్ 3 ఫస్ట్ రివ్యూ: నాని వైలెంట్ యాక్షన్ సినిమా ఎలా ఉందో చెప్పిన అడివి శేష్-hit 3 first review adivi sesh says nani action movie is stunning and has surprises ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  హిట్ 3 ఫస్ట్ రివ్యూ: నాని వైలెంట్ యాక్షన్ సినిమా ఎలా ఉందో చెప్పిన అడివి శేష్

హిట్ 3 ఫస్ట్ రివ్యూ: నాని వైలెంట్ యాక్షన్ సినిమా ఎలా ఉందో చెప్పిన అడివి శేష్

హిట్ 3 సినిమా గురించి అడివి శేష్ మాట్లాడారు. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు హాజరైన యంగ్ హీరో.. తన రివ్యూ చెప్పారు. చాలా సర్‌ప్రైజ్‍లు ఉంటాయంటూ మరింత హైప్ పెంచేశారు.

హిట్ 3 ఫస్ట్ రివ్యూ: నాని యాక్షన్ సినిమాకు రివ్యూ చెప్పిన అడివి శేష్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 చిత్రంపై హైప్ ఓ రేంజ్‍లో ఉంది. సూపర్ సక్సెస్ అయిన హిట్ ఫ్రాంచైజీలో మూడో మూవీగా ఇది తెరకెక్కింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రంలో నాని వైలెంట్ మోడ్‍లో కనిపించనున్నారు. ట్రైలర్ ద్వారా మరింత హైప్ పెరిగింది. మే 1వ తేదీన హిట్ 3 విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. హిట్ 3 గురించి తన రివ్యూను ఈ ఈవెంట్‌లో చెప్పారు యంగ్ హీరో అడివి శేష్.

స్టన్నింగ్, చాలా సర్‌ప్రైజ్‍లు

హిట్ 3 చివరి 30 నిమిషాలు తాను చూశానని, స్టన్నింగ్‍గా ఉందని అడివి శేష్ అన్నారు. చాలా సర్‌ప్రైజ్‍లు కూడా ఉంటాయని చెప్పారు. “హిట్ 3 లాస్ట్ 30 నిమిషాలు చూశా. మూమూలుగా ఉండదు. బీభత్సం, క్రేజీగా ఉంది. మీకు తెలియని చాలా సర్‌ప్రైజ్‍లు సినిమాలో ఉన్నాయి. చాలా ఎగ్జైటెడ్‍గా ఉన్నా” అని శేష్ తన రివ్యూ చెప్పారు.

ఈ ఫ్రాంచైజీలో రెండో మూవీ హిట్ 2లో హీరోగా చేశారు అడివి శేష్. అది సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో హిట్ 3 ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు శేష్ వచ్చారు. హిట్ 1 చేసిన విశ్వక్ కూడా ఈవెంట్‍కు హాజరయ్యారు. శేష్ చెప్పిన రివ్యూతో హిట్ 3పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ చివర్లో ఓ హీరో క్యామియో ఉంటుందనే రూమర్లు కూడా ఉన్నాయి.

ఎంతో టాలెండెట్ అయిన డైరెక్టర్ శైలేశ్ చాలా వేగంగా సినిమాలు తీసేస్తుంటాడని, తన గూఢచారి 2 మూవీ మాత్రం ఆలస్యమవుతోందనేలా అడివి శేష్ మాట్లాడారు. “శైలేష్ వేగంగా తీసేస్తుంటాడు. ఇక్కడ నేను గూఢచారి 2 ప్రకటించి 60శాతం అయ్యే సరికి, శైలేశ్ హిట్ 3 అనౌన్స్ చేసి.. సినిమా కంప్లీట్ చేసి రిలీజ్‍కు తీసుకొచ్చేశాడు. ఈ పాస్ట్ వర్కింగ్ ఏంటో మాకు కూడా నేర్పించు” అని శేష్ అన్నారు. గూఢచారికి సీక్వెల్‍గా వస్తున్న స్పై యాక్షన్ మూవీ జీ2లో హీరోగా నటిస్తున్న శేష్.. స్క్రీన్‍ప్లే బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు.

జీ2 మూవీ జూన్‍లో విడుదలవుతుందని మరో హీరో విశ్వక్‍సేన్ ఇదే ఈవెంట్‍లో ఓ లీక్ ఇచ్చారు. ఈ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తుండగా.. వామికా గబ్బి, ఇమ్రాన్ హష్మి కీలకపాత్రలు పోషిస్తున్నారు.

అనుకున్న దాని కంటే ఎదిగాడు: రాజమౌళి

హిట్ 3 ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నానిని ప్రశంసించారు. తాను అనుకున్న దాని కంటే నాని చాలా ఎత్తుకు ఎదిగాడని అన్నారు. రాజమౌళితో ఈగ చిత్రం చేశారు నాని. మహేశ్ బాబు చేస్తున్న ఎస్ఎస్ఎంబీ29 మూవీ అప్‍డేట్ కోసం యాంకర్ సుమ అడిగితే.. రాజమౌళి ఏమీ చెప్పలేదు.

హిట్ 3 చిత్రంలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటించారు. ఈ మూవీకి నానే ప్రొడ్యూజర్‌గా ఉన్నారు. మే 1వ తేదీన తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ మూవీ విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్‍లో ప్రమోషన్లు చేశారు నాని.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం