హిట్ ది ఫస్ట్ కేస్ అనే తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టారు డైరెక్టర్ శైలేష్ కొలను. డాక్టర్ అయిన శైలేష్ కొలను సినిమాల మీద ఇష్టంతో చేసిన హిట్ భారీ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత హిట్ 2తో మరో హిట్ అందుకున్నారు దర్శకుడు శైలేష్ కొలను.
ఇప్పుడు హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమాగా వస్తోంది హిట్ 3. మే 1న హిట్ 3 మూవీ వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం (ఏప్రిల్ 27) హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. యాంకర్ సుమ హోస్ట్‌గా చేసిన హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ శైలేష్ కొలను చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ముందుగా పెహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా షూటింగ్ సమయంలో డీవోపీ డిపార్ట్మెంట్ వర్క్ చేసిన కృష్ణ అనారోగ్యంతో చనిపోయారు. ఆయనకు సంతాపం తెలిజేస్తున్నాను" అని అన్నారు.
అప్పుడు అంతా నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం డైరెక్టర్ శైలేష్ కొలను కొనసాగిస్తూ.. "నా విజన్ ని నమ్మి ఈ సినిమాలో పార్ట్ అయిన నటీనటులకు సాంకేతిక నిపుణులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఆర్ డైరెక్టర్ నాగేంద్ర గారు వండర్‌ఫుల్ వరల్డ్ క్రియేట్ చేశారు. షాను గారు ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చారు" అని చెప్పారు.
"హిట్ 3 సినిమాకు మిక్కి జే మేయర్ బ్రిలియంట్ బిజీఎమ్, మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పార్ట్ అయినా శ్రీనిధి శెట్టి థాంక్యూ. నాని గారు అంటే నాకు చాలా ఇష్టం. సినిమా మీద ఆయనకున్న పేషన్ అద్భుతం" అని డైరెక్టర్ శైలేష్ కొలను తెలిపారు.
"ఈ సినిమా షూటింగ్‌లో నాని గారి హెయిర్ (జుట్టు)కి ఫైర్ అంటుకుంది. వెంటనే యూనిట్ వెళ్లి ఆపింది. ఇంకా షూటింగ్ ఉండదనుకున్నాను. కానీ, ఆయన నెక్ట్స్ షాట్‌కి రెడీ అయిపోయారు. అదే రోజు షూటింగ్‌లో నాని తలకి గాయం అయింది. రక్తం కారిపోతూనే ఉంది. 4 సీన్స్ ఉన్నాయంటే బ్లడ్ క్లాట్ అయ్యే వరకు ఆగారు. బ్లడ్ క్లాట్ అయిన తర్వాత మిగిలిన సీన్స్ అన్ని ఫినిష్ చేసి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుని మళ్లీ షూటింగ్‌కి వచ్చేసారు" అని నానికి జరిగిన ప్రమాదం గురించి శైలేష్ కొలను చెప్పుకొచ్చారు.
"సినిమా మీద ఆయనకున్న మ్యాడ్ పేషన్ వండర్‌ఫుల్. నాని గారు పక్కన ఉంటే చాలా ఇన్స్పైరింగ్‌గా ఉంటుంది. నన్ను ఇంత బలంగా నమ్మిన నాని గారికి థాంక్యూ. మే ఒకటి నా సినిమా రిలీజ్ అవుతుంది. ఇది చాలా హానెస్ట్ ఫిలిం. వయోలెంట్‌గా ఉంటుంది. సినిమాని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి" అని హిట్ 3 డైరెక్టర్ శైలేష్ కొలను తన స్పీచ్ ముగించారు.
సంబంధిత కథనం