నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హిట్ 3’ చిత్రం మరొక్క రోజులో మే 1వ తేదీన విడుదల కానుంది. ఈ యాక్షన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్లో వైలెంట్ యాక్షన్‌తో నాని రెచ్చిపోయారు. దీంతో హైప్ మరింత పెరిగిపోయింది. ఈ చిత్రానికి టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ రేంజ్లో జరుగుతున్నాయి. ఈ తరుణంలో హిట్ 3 తొలి రోజు ఎంత కలెక్షన్లు రాబడుతుందో అంచనాలు వెలువడుతున్నాయి.
హిట్ 3 మూవీకి టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ దూకుడుగా జరుగుతున్నాయి. బుకింగ్స్ ఓపెనైన చోట్లు జోరుగా ఫిల్ అవుతున్నాయి. హైదరాబాద్ సిటీలో బుకింగ్స్ అంచనాలకు మించి జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ మంచి కలెక్షన్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రం విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్లో ప్రమోషన్లు చేశారు నాని. మొత్తంగా హిట్ 3 సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.40కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఉన్నాయి.
ఒకవేళ హిట్ 3 చిత్రం అంచనాలకు తగ్గట్టుగా తొలి రోజు రూ.40కోట్ల మార్క్ సాధిస్తే.. నాని కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా నిలిచిపోతుంది. దసరా మూవీ ఫస్ట్ డే సుమారు రూ.37కోట్ల గ్రాస్ దక్కించుకోగా.. నానికి ఇప్పటి వరకు అదే తొలి రోజు హయ్యెస్ట్ ఓపెనింగ్ మూవీగా ఉంది. హిట్ 3 దాన్ని దాటేసి నేచురల్ స్టార్‌కు కొత్త ఓపెనింగ్ రికార్డు ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు నిజమై తొలి రోజు హిట్ 3 సత్తాచాటుతుందేమో చూడాలి.
హిట్ 3 సినిమా బజ్ చాలా ఉంది. అలాగే, నానిపై ప్రేక్షకులకు నమ్మకం బోలెడు. దీంతో తొలి రోజు ఈ చిత్రం అదరగొట్టే అవకాశం ఉంది. గురువారం రిలీజవుతున్నా మేడే హాలీడే కావటం ఈ మూవీకి మరో ప్లస్. పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి తిరుగే ఉండదు. సూర్య ‘రెట్రో’ తెలుగు డబ్బింగ్‌తో పోటీలో ఉంది. కానీ హిట్ 3కే హైప్ ఎక్కువగా ఉంది.
హిట్ ఫ్రాంచైజీలో మూడో చిత్రంగా ఇది మూవీ వస్తోంది. హిట్ 3 చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకు నానినే నిర్మాతగా వ్యవహరించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం