హిట్ 3 కలెక్షన్ల ర్యాంపేజ్.. ఆ మైల్‍స్టోన్ దాటేసిన నాని యాక్షన్ సినిమా.. అక్కడ అప్పుడే ప్రాఫిట్ జోన్‍లోకి!-hit 3 box office collections nani action movie crosses 100 crore mark in 4 days ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  హిట్ 3 కలెక్షన్ల ర్యాంపేజ్.. ఆ మైల్‍స్టోన్ దాటేసిన నాని యాక్షన్ సినిమా.. అక్కడ అప్పుడే ప్రాఫిట్ జోన్‍లోకి!

హిట్ 3 కలెక్షన్ల ర్యాంపేజ్.. ఆ మైల్‍స్టోన్ దాటేసిన నాని యాక్షన్ సినిమా.. అక్కడ అప్పుడే ప్రాఫిట్ జోన్‍లోకి!

హిట్ 3 సినిమా దుమ్మురేపుతోంది. అదిరే వసూళ్లను సాధిస్తోంది. ఈ క్రమంలో నాలుగు రోజుల్లోనే ఓ మైల్‍స్టోన్ దాటేసింది. కాగా, కొన్ని ఏరియాల్లో ఈ చిత్రం అప్పుడే లాభాల్లోకి అడుగుపెట్టింది. ఆ వివరాలు ఇవే..

హిట్ 3 కలెక్షన్ల ర్యాంపేజ్.. ఆ మైల్‍స్టోన్ దాటేసిన నాని యాక్షన్ సినిమా.. అక్కడ అప్పుడే ప్రాఫిట్ జోన్‍లోకి!

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 (హిట్: థర్డ్ కేస్) బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. గత గురువారం మే 1వ తేదీన విడుదలైన ఈ వైలెంట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మొదటి నుంచి కలెక్షన్లలో జోరు చూపిస్తోంది. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వస్తున్నా వసూళ్లలో దూకుడు కనబరుస్తోంది. ఈ క్రమంలో హిట్ 3 చిత్రం నాలుగు రోజుల్లోనే మేజర్ మైల్‍స్టోన్ దాటేసింది.

రూ.100కోట్ల మార్క్ దాటేసి..

హిట్ 3 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటేసింది. నాలుగు రోజుల్లో ఈ మూవీ రూ.101 గ్రాస్ వసూళ్లను దక్కించుకుందని తెలుస్తోంది. ఫస్ట్ వీకెండ్‍లోనే ఈ మైల్‍స్టోన్ దాటి హిట్ 3 చిత్రం సత్తాచాటింది.

నానికి వరుసగా నాలుగో హిట్

నాని వరుసగా నాలుగో సూపర్ హిట్ కొట్టేశారు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలు బ్లాక్‍బస్టర్ కాగా.. ఇప్పుడు హిట్ 3 కూడా దుమ్మురేపుతోంది. నానికి ఇది మూడో రూ.100కోట్ల చిత్రంగా నిలిచింది. ఈ మూవీ ఇదే జోరు కొనసాగిస్తే ఫుల్ రన్‍లో రూ.200కోట్ల మైల్‍స్టోన్ కూడా సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే నానికి ఆ మార్క్ ఫస్ట్ టైమ్ కానుంది. అయితే, సోమవారం ట్రెండ్‍ను బట్టి కలెక్షన్లు ఎలా సాగుతాయో తేలనుంది.

అక్కడ లాభాల్లోకి..

హిట్ 3 సినిమా ఇప్పటికే కొన్ని చోట్ల లాభాల్లోకి వచ్చేసింది. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది. నైజాం, ఓవర్సీస్‍లో ఇప్పటికే ఈ మూవీ ప్రాఫిట్ జోన్‍లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. వైజాగ్‍ సహా మరిన్ని చోట్ల బ్రేక్ఈవెన్ అయింది. మరొక్క రోజులో మరిన్ని ప్రాంతాల్లో ఈ చిత్రం బయ్యర్లు లాభాల్లోకి వచ్చేస్తారు. ఫుల్ రన్‍లో హిట్ 3 పూర్తిస్థాయి ప్రాఫిట్ మూవీగా అవడం ఖాయంగా కనిపిస్తోంది. వేసవిలో టాలీవుడ్‍లో ఎట్టకేలకు ఈ మూవీ సాలిడ్ హిట్ ఇచ్చింది.

హిట్ 3 సినిమాలో అర్జున్ సర్కార్ పాత్రలో నాని దుమ్మురేపారు. వైలెంట్ యాక్షన్‍తో అదరగొట్టారు. ఈ చిత్రంలో అతడికి జోడీగా శ్రీనిధి శెట్టి నటించారు. రావు రమేశ్, కోమలీ ప్రసాద్, రవీంద్ర విజయ్, ప్రతీక్ బబ్బర్ కీలకపాత్రలు పోషించారు. హిట్ 3 సినిమాను నానినే నిర్మించారు. ఈ మూవీ చివర్లో తమిళ స్టార్ హీరో కార్తి క్యామియో రోల్‍లో కనిపించారు. హిట్ 4లో ఆయనే హీరోగా నటించనున్నారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం