OTT Releases This Week:,అడివి శేష్ హిట్ -2 ( Hit 2) - అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)అడివిశేష్ (Adivi Sesh )హీరోగా నటించిన హిట్ -2 సినిమా అమెజాన్ ప్రైమ్ లో జనవరి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సైకో కిల్లర్ కథాంశంతో రూపొందిన ఈసినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. హీరో నాని నిర్మించిన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. తొలుత రెంటల్ విధానంలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ శుక్రవారం నుంచి ఫ్రీగా హిట్ -2 సినిమాను సబ్‌స్క్రైబర్లు అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది.,ఉంచాయ్ - జీ5 (Unchaai Movie)అమితాబ్ బచ్చన్ , అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం ఉంచాయ్. వయసు మళ్లిన నలుగురు స్నేహితులు ఎవరెస్ట్ శిఖరంపైకి సాగించే ప్రయాణాన్ని ఎమోషనల్‌గా ఆవిష్కరిస్తూ సీనియర్ డైరెక్టర్ సూరజ్ బర్జాత్యా ఉంచాయ్ సినిమాను తెరకెక్కించాడు. విమర్శకుల ప్రశంసల్ని అందుకున్న ఈ సినిమా జనవరి 6న జీ5 ఓటీటీలో రిలీజ్ కాబోతున్నది.,అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే - ప్రభాస్, గోపీచంద్ ఎపిసోడ్ - ఆహా ఓటీటీబాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ టాక్ షోలో స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఎపిసోడ్ సెకండ్ పార్ట్ శుక్రవారం ఆహా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ ఎపిసోడ్‌లో ప్రభాస్‌తో పాటు టాలీవుడ్ హీరో గోపీచంద్ పాల్గొననున్నారు. ఇద్దరు కలిసి తమ సినీ ప్రయాణం ప్రారంభమైన తీరును, కెరీర్ తొలినాటి విశేషాల్ని బాలకృష్ణతో పంచుకోబోతున్నారు. ఈ ఎపిసోడ్‌లో కృష్ణంరాజు మరణంపై ప్రభాస్ స్పందించబోతున్నట్లు తెలిసింది.,త్రీసీఎస్ (ఛాయిసెస్, ఛాన్సెస్ అండ్ ఛేంజెస్) (తెలుగు వెబ్ సిరీస్) - సోని లివ్ ,స్టోరీ ఆఫ్ థింగ్స్ (తమిళ్ మూవీ) - సోని లివ్.,నాయ్‌సేకర్ రిటర్న్స్ - నెట్ఫ్లిక్స్కోలీవుడ్ సీనియర్ కమెడియన్ వడివేలు (Vadivelu) ప్రధాన పాత్రల్లో నటించిన నాయ్ సేకర్ రిటర్న్స్ సినిమా జనవరి 6న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత తమిళంలో వడివేలు నటించిన సినిమా ఇది. సూరజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.,స్కూల్ 2017 (కొరియన్ వెబ్ సిరీస్ తెలుగు డబ్బింగ్ ) - ఆహా,సౌది వెళ్లక్క - మలయాళం - సోని లివ్,లేడీ నాయిర్ - నెట్‌ఫ్లిక్స్,స్టార్ వార్స్ ది బ్యాడ్ బ్యాచ్ - నెట్‌ఫ్లిక్స్ (Netflix),ముంబాయి మాఫియా - పోలీస్ వర్సెస్ అండర్ వరల్డ్ - నెట్‌ఫ్లిక్స్,ది పేల్ బ్లూ ఐ - నెట్‌ఫ్లిక్స్,తాజా కబర్ - డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar),ఉమెన్ ఆఫ్ ది డెడ్ - నెట్‌ఫ్లిక్స్