Horror OTT: ఓటీటీలో అదరగొడుతున్న హారర్ మూవీ.. మూడు రోజుల్లోనే టాప్‍లో ట్రెండింగ్.. రెండో ప్లేస్‍లో ఆరేళ్ల నాటి చిత్రం-hindi horror comedy movie munjya trending in top on disney plus hotstar and stree in second place ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Horror Ott: ఓటీటీలో అదరగొడుతున్న హారర్ మూవీ.. మూడు రోజుల్లోనే టాప్‍లో ట్రెండింగ్.. రెండో ప్లేస్‍లో ఆరేళ్ల నాటి చిత్రం

Horror OTT: ఓటీటీలో అదరగొడుతున్న హారర్ మూవీ.. మూడు రోజుల్లోనే టాప్‍లో ట్రెండింగ్.. రెండో ప్లేస్‍లో ఆరేళ్ల నాటి చిత్రం

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 28, 2024 07:46 PM IST

DisneyPlus Hotstar OTT Trending: బాలీవుడ్ సూపర్ హిట్ హారర్ కామెడీ మూవీ ముంజ్య ఓటీటీలోనూ అదరగొడుతోంది. స్ట్రీమింగ్‍కు వచ్చిన మూడు రోజుల్లోనే ట్రెండింగ్‍లో ప్రస్తుతం టాప్ ప్లేస్‍కు వచ్చింది. ఆరేళ్ల కిందటి చిత్రం ప్రస్తుతం ఆ ఓటీటీలో రెండో ప్లేస్‍లో ఉంది.

OTT: ఓటీటీలో అదరగొడుతున్న హారర్ కామెడీ మూవీ.. మూడు రోజుల్లోనే టాప్‍లో ట్రెండింగ్.. రెండో ప్లేస్‍లో ఆరేళ్ల నాటి చిత్రం
OTT: ఓటీటీలో అదరగొడుతున్న హారర్ కామెడీ మూవీ.. మూడు రోజుల్లోనే టాప్‍లో ట్రెండింగ్.. రెండో ప్లేస్‍లో ఆరేళ్ల నాటి చిత్రం

థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయిన ‘ముంజ్య’ సినిమా ఓటీటీలోనూ అదే జోరు కనబరుస్తోంది. తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ హారర్ కామెడీ సినిమా సుమారు రూ.132 కోట్ల కలెక్షన్లతో దుమ్మురేపింది. శార్వరీ వాఘ్, అజయ్ వర్మ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం జూన్ 7న థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ అయింది. తాజాగా ఈ మూవీ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలోనూ ఈ చిత్రం అదరగొడుతోంది.

ట్రెండింగ్‍లో టాప్

ఎంతో నిరీక్షించిన ముంజ్య సినిమా ఆగస్టు 25న హఠాత్తుగా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీలో అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలో వచ్చిన మూడు రోజుల్లోనే హాట్‍స్టార్ హిందీ ట్రెండింగ్‍లో ఈ చిత్రం టాప్ ప్లేస్‍కు వచ్చేంది.

ముంజ్య సినిమా హాట్‍స్టార్ ఓటీటీలో భారీ వ్యూస్ దక్కించుకుంటోంది. దీంతో ప్రస్తుతం (ఆగస్టు 28) హిందీ ట్రెండింగ్‍లో ఫస్ ప్లేస్‍లో ఉంది. ఓటీటీలో రిలీజ్ అయ్యాక కూడా ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

ముంజ్య చిత్రానికి ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించారు. ముంజ్య అనే దెయ్యం చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది. ఈ మూవీలో శార్వరి, అజయ్ సహా మోనా సింగ్, సత్యరాజ్, సుహాస్ జోషి, తరణ్‍జ్యోతి సింగ్, అజయ్ పుర్కర్ కీరోల్స్ చేశారు. మాడ్‍డాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేశ్ విజన్, అమర్ కౌశిక్ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేయగా.. సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.

ముంజ్య చిత్రం థియేటర్లలో మంచి వసూళ్లు సాధించింది. పాజిటివ్ టాక్‍తో లాంగ్ థియేట్రికల్ రన్ సొంతం చేసుకుంది. అందుకే సుమారు 70 రోజుల తర్వాత ఈ చిత్రం హాట్‍స్టార్ ఓటీటీలోకి వచ్చింది. ముంజ్య మూవీ రూ.30 కోట్ల బడ్జెట్‍తో రూపొంది.. సుమారు రూ.132 కోట్ల కలెక్షన్లను సాధించింది.

రెండో ప్లేస్‍లో స్త్రీ

డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ హిందీ ట్రెండింగ్‍లో ‘స్త్రీ’ సినిమా ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. 2018లో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఇప్పుడు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఓటీటీలో ట్రెండింగ్‍లోకి వచ్చింది. స్త్రీకి సీక్వెల్‍గా ఈనెల 15వ తేదీన స్త్రీ2 చిత్రం వచ్చింది. దీంతో హాట్‍స్టార్ ఓటీటీలో చాలా మంది స్త్రీ మూవీ చూస్తున్నారు. దీంతో ఆ చిత్రం ఇప్పుడు ట్రెండింగ్‍లోకి వచ్చింది.

హారర్ కామెడీ మూవీ స్త్రీలో శ్రద్ధా కపూర్, రాజ్‍కుమార్ రావ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు.

మలయాళ సర్వైవల్ కామెడీ మూవీ గర్ర్ కూడా ప్రస్తుతం డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో మూడో ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది. కుంచాకో బోబన్, సూరజ్ వెంజరమూడు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు చేశారు. జూన్ 14 థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఆగస్టు 20న హాట్‍స్టార్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చింది.

తెలుగులో డార్లింగ్ సినిమా ప్రస్తుతం హాట్‍స్టార్ ఓటీటీలో ట్రెండింగ్‍లో ఉంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ చేశారు. ఈ కామెడీ రొమాంటిక్ సినిమా జూలై 29 థియేటర్లలో రిలీజై అనుకున్న విధంగా కలెక్షన్లు దక్కించుకోలేకపోయింది. ఈ మూవీ ఆగస్టు 13న హాట్‍స్టార్‌లోకి అడుగుపెట్టింది.