Highest Remuneration: ఒక్క సినిమాకే రూ.30 కోట్లు.. ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ ఈమెనే..-highest remuneration heroine in india priyanka chopra 30 crores remuneration for ssmb29 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Highest Remuneration: ఒక్క సినిమాకే రూ.30 కోట్లు.. ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ ఈమెనే..

Highest Remuneration: ఒక్క సినిమాకే రూ.30 కోట్లు.. ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ ఈమెనే..

Hari Prasad S HT Telugu

Highest Remuneration: ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? దీపికా పదుకోన్, ఆలియా భట్, కరీనా కపూర్, నయనతార వంటి వారిని వెనక్కి నెట్టిన ఈ హీరోయిన్ ఒక్క సినిమాకే ఏకంగా రూ.30 కోట్లు వసూలు చేస్తోంది.

ఒక్క సినిమాకే రూ.30 కోట్లు.. ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ ఈమెనే..

Highest Remuneration: ఇండియన్ మూవీస్ లో నటీనటుల రెమ్యునరేషన్ అనేది చాలా రహస్యంగా ఉంచుతారు. అయితే అప్పుడప్పుడు వచ్చే లీకులు వీటి గురించి ప్రేక్షకులకు చెబుతుంటాయి. ఇప్పుడు ఇండియాలో మేల్ సూపర్ స్టార్లు ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుంటే.. వాళ్లకు ఏమాత్రం తక్కువ కాదని హీరోయిన్లు కూడా నిరూపిస్తున్నారు.

తాజాగా ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటి అనే టైటిల్ ఇటీవల చేతులు మారింది. ఒక స్టార్ ఆరేళ్ల తర్వాత ఇండియన్ సినిమాలో తన రీఎంట్రీ మూవీ కోసం ఏకంగా రూ.30 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంది.

అత్యధిక రెమ్యునేషన్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా

దాదాపు ఆరేళ్ల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రియాంక దక్షిణాదికి రీఎంట్రీ ఇస్తున్న చిత్రమిది. ఈ సినిమా కోసం ప్రియాంక రూ.30 కోట్లు వసూలు చేసిందని, ఒక భారతీయ నటి ఒక సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకుందని బాలీవుడ్ హంగామా ఆ మధ్య వెల్లడించింది.

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ప్రియాంక రేంజ్ అసాధారణ స్థాయిలో పెరిగిపోయింది. దీంతో రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలేదని ఆమె నిర్ణయించింది. అందుకే ఈ ప్రాజెక్టుకు సంతకం చేసే విషయంలో ఆమె ఎక్కువ సమయం తీసుకుంది.

ప్రియాంక గతంలో తన అమెజాన్ ప్రైమ్ వీడియో షో సిటడెల్ కోసం 5 మిలియన్ డాలర్లు (రూ.41 కోట్లకు పైగా) వసూలు చేసింది. కానీ అది ఆరు గంటల రన్ టైమ్ కావడంతో ఆ మొత్తం సమంజసమే. ఎస్ఎస్ఎంబీ29 కోసం ఆమె తీసుకున్న రూ.30 కోట్ల పారితోషికం మాత్రం చాలా చాలా ఎక్కువే అని చెప్పాలి. ఏ భారతీయ సినిమాకు గతంలో ఓ హీరోయిన్ ఇంత మొత్తం అందుకున్నది లేదు.

ప్రియాంక వెనక్కి నెట్టింది వీళ్లనే..

రాజమౌళి జంగిల్ అడ్వెంచర్ కోసం ప్రియాంక సంతకం చేసే ముందు వరకు దీపికా పదుకోన్ కల్కి 2898 ఏడీ కోసం రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది. అప్పట్లో అత్యధిక పారితోషికం అందుకున్న భారతీయ నటిగా నిలిచింది.

ఇక ఆలియా భట్ ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుండగా.. కరీనా కపూర్, కత్రినా కైఫ్, కియారా అద్వానీ, నయనతార, సమంత రూత్ ప్రభు వంటి వారు ఒక్కో ప్రాజెక్టుకు రూ.10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారు.

ప్రియాంక రీఎంట్రీ

2015లో అమెరికా వెళ్లినప్పటి నుంచి ప్రియాంక చోప్రా ఇండియన్ సినిమాల్లో కనిపించడం లేదు. 2016 లో జై గంగాజల్ విడుదలైన తరువాత, ఆమె 2019 లో విడుదలైన షోనాలి బోస్ ది స్కై ఈజ్ పింక్ అనే ఒక భారతీయ చిత్రంలో మాత్రమే కనిపించింది.

ఆలియా భట్, కత్రినా కైఫ్ లతో ఆమె నటించిన రోడ్ ట్రిప్ చిత్రం జీ లే జరా నిరవధికంగా వాయిదా పడటంతో ఆరేళ్లుగా ఆమె థియేటర్లలో కానీ, ఓటీటీల్లో కానీ ఒక్క భారతీయ సినిమా రిలీజ్ కాలేదు. అయితే ఈ కాలంలో ప్రియాంక సిటాడెల్, ది వైట్ టైగర్, ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్, లవ్ ఎగైన్ వంటి వాటిలో నటించింది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం