Highest Paid TV Actor: ప్రపంచంలో అత్యధిక మొత్తం అందుకుంటున్న టీవీ నటి ఈమెనే.. గతేడాది ఆమె సంపాదనెంతో తెలుసా?-highest paid tv actor in the world mariska hargitay earns over 200 crores in 2024 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Highest Paid Tv Actor: ప్రపంచంలో అత్యధిక మొత్తం అందుకుంటున్న టీవీ నటి ఈమెనే.. గతేడాది ఆమె సంపాదనెంతో తెలుసా?

Highest Paid TV Actor: ప్రపంచంలో అత్యధిక మొత్తం అందుకుంటున్న టీవీ నటి ఈమెనే.. గతేడాది ఆమె సంపాదనెంతో తెలుసా?

Hari Prasad S HT Telugu

Highest Paid TV Actor: ఓ టీవీ నటి హాలీవుడ్ స్టార్లను మించి సంపాదిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక మొత్తం అందుకునే టీవీ నటిగా ఆమె రికార్డు క్రియేట్ చేసింది. గతేడాది ఆమె సంపాదన చూస్తే కళ్లు తేలేయాల్సిందే.

ప్రపంచంలో అత్యధిక మొత్తం అందుకుంటున్న టీవీ నటి ఈమెనే.. గతేడాది ఆమె సంపాదనెంతో తెలుసా?

Highest Paid TV Actor: టీవీయే కదా అని తీసిపారేయొద్దు. వీటిలో నటించే వాళ్లు కూడా సినిమా వాళ్లకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తూనే ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక మొత్తం అందుకునే నటి ఎవరో తేలిపోయింది. ఫోర్బ్స్ గత నెల ఈ జాబితాను రిలీజ్ చేసింది. ఆ నటి పేరు మరిస్కా హర్గిటే (Mariska Hargitay). ఈమె వయసు 61 ఏళ్లు కావడం విశేషం.

26 ఏళ్లుగా ఒకే షో.. భారీ రెమ్యునరేషన్

టీవీల్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ లాంటి షోలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సినిమాలకు తీసిపోని క్రేజ్ వీటి సొంతం. అలాగే అమెరికాలో 26 ఏళ్లుగా నడుస్తున్న షో ఒకటి ఉంది. దీని పేరు లా అండ్ ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్. అత్యధిక కాలం పాటు సాగిన అమెరికన్ ప్రైమ్ టైమ్ డ్రామాగా దీనికి పేరుంది. ఇందులో నటించే మరిస్కా హర్గిటే ప్రపంచంలోనే అత్యధిక మొత్తం అందుకుంటున్న టీవీ నటిగా నిలుస్తోంది.

ఈ షో 26 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. అందులో ఆమె నటిస్తూనే ఉంది. 2024లోనే మరిస్కా ఏకంగా 2.5 కోట్ల డాలర్లు (సుమారు రూ.214 కోట్లు) సంపాదించడం విశేషం. దీంతో ఆమె ప్రపంచంలోనే అత్యధిక మొత్తం అందుకుంటున్న నటిగా నిలిచింది. గతేడాది అత్యధిక మొత్తం అందుకున్న నటీనటుల జాబితాను ఫోర్బ్స్ రిలీజ్ చేయగా.. అందులో ఈమె 11వ స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో డ్వేన్ జాన్సన్, రియాన్ రేనాల్డ్స్ ఉన్నారు.

హాలీవుడ్ స్టార్లను మించి..

టీవీ నటే కదా అని మరిస్కా హర్గిటేనే తీసిపారేయలేం. ఆమె ఎంతో మంది హాలీవుడ్ సెలబ్రిటీల సంపాదనను కూడా దాటేసింది. జేసన్ స్టాథమ్, మార్క్ వాల్‌బెర్గ్, మ్యాట్ డామన్, జేక్ గిలెనాల్ లాంటి వాళ్లు కూడా హర్గిటే తర్వాతే నిలిచారు. హర్గిటే గురించి ఫోర్బ్స్ చాలా గొప్పగా చెప్పింది.

“లా అండ్ ఆర్డర్ స్పెషల్ విక్టిమ్స్ యూనిట్ యాంకర్ గా 20 ఏళ్లకు పైగా, 550 ఎపిసోడ్లు చేసిన 61 ఏళ్ల హర్గిటే ప్రపంచంలోనే అత్యధిక మొత్తం అందుకుంటున్న టీవీ నటిగా నిలుస్తోంది. ఆమె ప్రతి ఎపిసోడ్ కు 7.5 లక్షల డాలర్లు అందుకోవడంతోపాటు షోలో వచ్చిన లాభాల్లోనూ వాటా అందుకుంటోంది” అని ఫోర్బ్స్ తెలిపింది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం