OTT Highest Paid Actor: ఇండియాలో ఓటీటీ స్ట్రీమింగ్ మొదలైన తర్వాత టీవీ స్టార్లతోపాటు ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ఇండస్ట్రీల నుంచి కూడా పెద్ద పెద్ద స్టార్లు వెబ్ సిరీస్ లలో నటించడం మొదలుపెట్టారు. కానీ వీళ్లందరికీ ఓ స్టార్ హీరో మాత్రం ఒకే సీజన్ వెబ్ సిరీస్ కోసం ఏకంగా రూ.125 కోట్లు వసూలు చేశాడంటే నమ్మగలరా? ఆ హీరో పేరు అజయ్ దేవగన్.
రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ 2022లో జియోహాట్‌స్టార్ లో వచ్చిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇందులో అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించాడు. ఆ మధ్య నెట్‌ఫ్లిక్స్ లో హీరామండి వెబ్ సిరీస్ రాక ముందు వరకు దేశంలో అత్యధిక బడ్జెట్ వెబ్ సిరీస్ ఈ రుద్రనే. ఇప్పటి వరకూ ఒక్క సీజన్ మాత్రమే స్ట్రీమింగ్ అయింది. లూథర్ పేరుతో వచ్చిన బ్రిటీష్ సిరీస్ కు ఇది ఇండియన్ రీమేక్.
దీనికోసం 2021లో అజయ్ దేవగన్ సైన్ చేశాడు. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం అతడు ఏకంగా రూ.125 కోట్లు వసూలు చేసినట్లు బాలీవుడ్ హంగామా రిపోర్టు వెల్లడించింది. అంటే ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా రూ.18 కోట్లు. ఇప్పటి వరకూ ఓటీటీలో ఏ ఇతర ఇండియన్ యాక్టర్ ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ వసూలు చేయలేదు.
ఇండియాలో షారుక్ ఖాన్ స్టేటస్ ఏంటో మనకు తెలుసు. బాలీవుడ్ బాద్ షాగా అతన్ని పిలుస్తారు. అజయ్ దేవగన్ ఈ సిరీస్ చేస్తున్న సమయానికి షారుక్ ఖాన్ కూడా ఒక్కో సినిమాకు రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకే వసూలు చేసేవాడు.
కానీ ఏడు ఎపిసోడ్ల రుద్ర వెబ్ సిరీస్ కోసం మాత్రం అజయ్ దేవగన్ రూ.125 కోట్లు వసూలు చేసి ఆశ్చర్యపరిచాడు. ఏడు ఎపిసోడ్లు అంటే సుమారు రెండు సినిమాలతో సమానం. దీంతో అజయ్ ఈ స్థాయి రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడు.
ఓటీటీ వచ్చిన కొత్తలో ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ లలో కొత్త నటీనటులే ఉండేవారు. అయితే క్రమంగా డిజిటల్ స్పేస్ కు డిమాండ్ పెరగడంతో పెద్ద పెద్ద స్టార్లు కూడా ఓటీటీ వైపు చూడటం మొదలుపెట్టారు. అయితే అజయ్ దేవగన్ స్థాయిలో ఎవరూ అంత భారీ మొత్తం రెమ్యునరేషన్ అందుకోలేదు.
అతని తర్వాత సేక్రెడ్ గేమ్స్ రెండో సీజన్ కోసం సైఫ్ అలీ ఖాన్ రూ.20 కోట్లు వసూలు చేశాడు. ఇక సిటడెల్: హనీ బన్నీ కోసం మరో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ రూ.15 కోట్లు తీసుకున్నాడు. నవాజుద్దీన్ సిద్దిఖీ, పంకజ్ త్రిపాఠీ, అలీ ఫజల్, సమంతలాంటి వాళ్లు ఓటీటీ షోల కోసం రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు జీక్యూ రిపోర్టు వెల్లడించింది.
సంబంధిత కథనం