Highest Paid Actor: నిమిషానికి రూ.4.5 కోట్లు.. అదీ రాజమౌళి సినిమా కోసం.. అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరో ఎవరో తెలుసా
Highest Paid Actor: ఓ హీరో ఒక నిమిషానికి రూ.4.5 కోట్లు వసూలు చేశాడంటే నమ్మగలరా? అది కూడా రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమా కోసం కావడం విశేషం. ఈ భారీ రెమ్యునరేషన్ అందుకున్న ఆ హీరో ఎవరో మీరే చూడండి.
Highest Paid Actor: టాలీవుడ్, బాలీవుడ్ అనే సంబంధం లేకుండా ఇప్పుడు టాప్ హీరోలు ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకూ వసూలు చేస్తున్నారు. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అంటూ వస్తున్న సినిమాల బడ్జెట్, రెమ్యునరేషన్లకైతే అసలు పరిమితే అదే.
మరి ఓ హీరో తాను సినిమాలో కనిపించే ఒక్కో నిమిషానికి రూ.4.5 కోట్లు వసూలు చేశాడన్న విషయం తెలుసా? రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసమే అతడు ఈ స్థాయి రెమ్యునరేషన్ తీసుకోవడం విశేషం.
అజయ్ దేవ్‌గన్ రెమ్యునరేషన్
రెండేళ్ల కిందట రిలీజై ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ఆర్ఆర్ఆర్ మూవీలో మన టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తోపాటు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ అతిథి పాత్ర పోషించిన సంగతి తెలుసు కదా. అయితే ఈ పాత్ర కోసం అజయ్ ఒక్కో నిమిషానికి రూ.4.5 కోట్లు తీసుకున్నట్లు వార్తలు రావడం గమనార్హం.
ఈ ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవ్‌గన్ కేవలం 8 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. దీనికోసం అతడు ఏకంగా రూ.35 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ఆ లెక్కన తాను స్క్రీన్ పై కనిపించిన ఒక్కో నిమిషానికి రూ.4.5 కోట్లు తీసుకున్నట్లే కదా. దీంతో ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటుడిగా అజయ్ దేవ్‌గన్ ఇలా నిలిచిపోయాడు.
ఆర్ఆర్ఆర్‌లో అజయ్ దేవ్‌గన్
ఆర్ఆర్ఆర్ మూవీలో అజయ్ దేవ్‌గన్.. రామ్ చరణ్ తండ్రి పాత్రలో కనిపించాడు. మూవీ ఫ్లాష్‌బ్యాక్ లో శ్రియ శరణ్ తో కలిసి నటించాడు. స్క్రీన్ పై ఉన్న కాసేపే అయినా తన నటనతో ఆకట్టుకున్నాడు. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ కావడంతో అజయ్ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలిసింది. రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లపైనే వసూలు చేసింది.
నిజానికి అతని మిగతా సినిమాల్లో రెమ్యునరేషన్ చాలా తక్కువ. ఓ సినిమాలో హీరోగా ఫుల్ లెంగ్త్ రోల్ కే అజయ్ రూ.35 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేయడు. కాకపోతే సినిమా లాభాల్లో 50 శాతం వాటా డిమాండ్ చేస్తుంటాడు. ఈ లెక్కన అతని హిట్ సినిమాలైన తన్హాజీ, దృశ్యం 2లాంటి వాటికి చూసుకున్నా రెమ్యునరేషన్ రూ.100 కోట్లపైనే ఉంటుంది. ఫూల్ ఔర్ కాంటే సినిమాతో 30 ఏళ్ల కిందట బాలీవుడ్ లో అడుగుపెట్టిన అజయ్ దేవ్‌గన్ పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు.
ఇప్పటికే అతి భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ గా పేరుగాంచిన రుద్రలోనూ అజయ్ నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడతడు సింగం అగైన్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా పుష్ప 2 రిలీజయ్యే ఆగస్ట్ 15నే రిలీజ్ కాబోతోంది. అంతకుముందు మార్చి 8న జ్యోతిక, మాధవన్ లతో కలిసి చేసిన మల్టీ స్టారర్ సైతాన్ రిలీజ్ కానుంది.