Highest Grossing New year Movie: రెండు రోజుల్లోనే రూ.670 కోట్లు.. అత్యధిక వసూళ్లు రాబట్టిన న్యూ ఇయర్ మూవీ ఇదే
Highest Grossing New year Movie: ప్రపంచంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన న్యూ ఇయర్ మూవీ ఏదో తెలుసా? ఈ సినిమా రెండు రోజుల్లోనే ఏకంగా రూ.670 కోట్లు వసూలు చేసింది. అవతార్, టైటానిక్ లాంటి సినిమాల రికార్డులను కూడా తిరగరాసిన సినిమా ఇది.
Highest Grossing New year Movie: పండగలకు పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ కావడం, భారీ వసూళ్లు రాబట్టడం సహజమే. అయితే సినిమా ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోని న్యూ ఇయర్ హాలీడే కూడా కళ్లు చెదిరే కలెక్షన్లను తెచ్చి పెడతాయని నిరూపించిన సినిమా స్టార్ వార్స్ ది ఫోర్స్ అవేకెన్స్. 2015లో వచ్చిన ఈ మూవీ.. ప్రపంచంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన న్యూ ఇయర్ మూవీగా చరిత్ర సృష్టించింది. అవతార్, టైటానిక్ రికార్డులు కూడా బ్రేక్ చేసిందీ మూవీ.
స్టార్ వార్స్ ది ఫోర్స్ అవేకెన్స్ వసూళ్లు
స్టార్ వార్స్ ది ఫోర్స్ అవేకెన్స్ మూవీ 2015లో వచ్చింది. ఆ ఏడాది డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. తొలి వారమే 50 కోట్ల డాలర్లకుపైగా వసూలు చేసింది. అయితే ఆ మూవీ బాక్సాఫీస్ జోరు రెండు, మూడు వారాల్లోనూ కొనసాగింది. ఈ సినిమా ప్రభంజనం ఏ స్థాయిలో ఉందంటే.. న్యూ ఇయర్ ఈవ్, న్యూ ఇయర్ డే కలిపి రెండు రోజుల్లోనే 10 కోట్ల డాలర్లు (అప్పటి రూపాయి విలువతో పోలిస్తే రూ.670 కోట్లు) వసూలు చేయడం విశేషం.
న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా డిసెంబర్ 31న 39 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక న్యూ ఇయర్ డే నాడు నార్త్ అమెరికాలో 35 మిలియన్ డాలర్లు, ఓవర్సీస్ లో మరో 26 మిలియన్ డాలర్లు వచ్చాయి. దీంతో మొత్తంగా 100 మిలియన్ డాలర్లు వసూలు చేసిన న్యూ ఇయర్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా అంతకుముందు గానీ, తర్వాత కానీ ఈ రికార్డు దరిదాపుల్లోకి కూడా ఈ సినిమా రాలేదు.
అవతార్, టైటానిక్ కూడా వెనక్కి..
న్యూ ఇయర్ డేనాడు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇప్పటికీ స్టార్ వార్స్ ది ఫోర్స్ అవేకెన్స్ పేరిటే రికార్డు ఉంది. అంతకుముందు 1998, జనవరి 1న జేమ్స్ కామెరాన్ డైరెక్ట్ చేసిన టైటానిక్ మూవీ 11.5 మిలియన్ డాలర్లతో రికార్డు క్రియేట్ చేసింది. ఆ తర్వాత 2004లో వచ్చిన ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ద కింగ్ మూవీ 12 మిలియన్ డాలర్లతో ఆ రికార్డును బ్రేక్ చేసింది.
2010లో మరోసారి జేమ్స్ కామెరాన్ డైరెక్ట్ చేసిన అవతార్ 25 మిలియన్ డాలర్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. 2016, జనవరి 1న ఈ రికార్డును స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్ బ్రేక్ చేసింది. ఆ మూవీ న్యూ ఇయర్ డే నాడు 35 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. మొత్తంగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ డాలర్లకుపైగా వసూలు చేయడం విశేషం. ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఐదో స్థానంలో ఉంది.
టాపిక్