Hidimbha OTT : ఓటీటీలో దుమ్ములేపుతున్న హిడింబ.. మనిషి రక్తం తాగే మరో మనిషి కథ-hidimbha ott release sensational response for hidimbha on ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hidimbha Ott : ఓటీటీలో దుమ్ములేపుతున్న హిడింబ.. మనిషి రక్తం తాగే మరో మనిషి కథ

Hidimbha OTT : ఓటీటీలో దుమ్ములేపుతున్న హిడింబ.. మనిషి రక్తం తాగే మరో మనిషి కథ

Anand Sai HT Telugu

Hidimbha OTT Release : నటుడు అశ్విన్ బాబు, నందిత శ్వేత నటించిన హిడింబ చిత్రం థియేటర్లలో విడుదలైన మిశ్రమ స్పందన అందుకుంది. అయితే తర్వాత ఓటీటీలో విడుదలై దుమ్మురేపుతోంది.

హిడింబ ఓటీటీ (Aha)

అశ్విన్, నందిత శ్వేత జంగా నటించిన చిత్రం హిడింబ(Hidimbha). ఈ సినిమా థియేటర్లలో విడుదలైనా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. ఓటీటీలోకి వచ్చాక మాత్రం.. అంతా మారిపోయింది. జనాలు ఎగబడి చూస్తున్నారు. అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన చిత్రం ఓటీటీ ప్రేక్షకుల నుండి సానుకూల స్పందనను పొందుతోంది. OAK ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్)పై గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పించారు. హిడింబకు సంగీతం వికాస్ బాడిసా స్వరపరిచారు.

ఆహాలో హిడింబ స్ట్రీమింగ్(Hidimbha Streaming On Aha) అవుతోంది. ఓటీటీలో మంచి హిట్ అందుకుంది. 150 మిలియన్ నిమిషాలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇది గొప్ప విజయం అని ఆహా వెల్లడించింది. ఈ సినిమా తమిళ డబ్బింగ్ వెర్షన్ కూడా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ పొందింది.

హిడింబ చిత్రం(Hidimbha Movie) థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకుంది. జూలై 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన హిడింబ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. ఆగస్టు 10వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి హిడింబ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్(Hidimbha OTT Streaming) అవుతోంది.

హిడింబ చిత్రంలో అశ్విన్ బాబు సరసన హీరోయిన్‍గా నటించింది నందితా శ్వేత. శ్రీనివాసరెడ్డి, మకరండ్ దేశ్ పాండే, సాహితి అవంచ, సంజయ్ స్వరూప్, విద్యుల్లేఖ రామన్, రాజీవ్ కనకాల, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. హిడింబ చిత్రానికి బాడిస వికాస్ సంగీతం అందించగా.. బి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ చేశాడు.

హైదరాబాద్ సిటీలో కొందరు మహిళలు వరుసగా మిస్ అవుతుంటారు. ఏసీపీ అభయ్ (అశ్విన్ బాబు), స్పెషల్ ఆఫీసర్ ఆద్య (నందిత శ్వేత) ఈ మిస్టరీని ఛేదించేందుకు దర్యాప్తు చేస్తుంటారు. మిస్ అయిన మహిళలు ఎవరు? ఎందుకు మిస్ అయ్యారు? ఈ కిడ్నాప్‍లు చేసింది ఎవరు? అసలు సినిమాలో ఎవరు విలన్? అనే విషయాలే హిడింబ మూవీ ప్రధాన కథ.