OTT Crime Thriller: ఓటీటీకి వచ్చిన తెలుగు ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్.. 9.1 ఐఎండీబీ రేటింగ్.. ఎక్కడ చూడాలంటే?-hide n seek ott streaming on aha telugu investigative crime thriller has 9 above imdb rating by viswant shilpa manjunath ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller: ఓటీటీకి వచ్చిన తెలుగు ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్.. 9.1 ఐఎండీబీ రేటింగ్.. ఎక్కడ చూడాలంటే?

OTT Crime Thriller: ఓటీటీకి వచ్చిన తెలుగు ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్.. 9.1 ఐఎండీబీ రేటింగ్.. ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu

Hide N Seek OTT Streaming: ఓటీటీలోకి వచ్చిన తెలుగు ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ హైడ్ అండ్ సీక్. తమిళ హీరోయిన్ శిల్పా మంజునాథ్, విశ్వంత్, రియా సచ్ దేవ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఐఎండీబీ నుంచి 9.1 రేటింగ్ సాధించింది. మరి హైడ్ అండ్ సీక్ ఓటీటీ ప్లాట్‌ఫామ్, స్ట్రీమింగ్ వివరాలు చూద్దాం.

ఓటీటీకి వచ్చిన తెలుగు ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్.. 9.1 ఐఎండీబీ రేటింగ్.. ఎక్కడ చూడాలంటే?

Hide N Seek OTT Release: హారర్, కామెడీ తర్వాత క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. స్టోరీ ఎలా ఉన్నా గ్రిప్పింగ్ నెరేషన్, థ్రిల్లింగ్ సీన్స్‌తో ఎంగేజింగ్‌గా ప్రజంట్ చేస్తే ఆ సినిమా మంచి హిట్ అవుతుంది. ఇంకా ఊహించిని ట్విస్టులు, టర్న్స్ ఉంటే ఆడియెన్స్ మరింతగా థ్రిల్ ఫీల్ అవుతారు.

మంచి రివ్యూస్‌తో

అలా 2024లో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీనే హైడ్ అండ్ సీక్. సహస్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కిన హైడ్ అండ్ సీక్ సినిమా గతేడాది సెప్టెంబర్ 20న థియేటర్స్‌లో విడుదలై మంచి రివ్యూస్‌తో పాజిటీవ్ టాక్ అందుకుంది.

విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా బసి రెడ్డి రానా దర్శకుడిగా పరిచయం అయ్యారు. నరేంద్ర బుచ్చి రెడ్డిగారి నిర్మించిన ఈ సినిమాలో సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను సీట్ ఎడ్జ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా డైరెక్టర్ బసిరెడ్డి రానా తెరకెక్కించారు.

9.1 ఐఎండీబీ రేటింగ్

ఎక్కడా రాజీ పడకుండా నిర్మాత నరేంద్ర బుచ్చి రెడ్డిగారి ఈ మూవీని నిర్మించారు. అలాంటి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్సే రాబట్టింది. అంతేకాకుండా అన్ని సినిమాలకు రేటింగ్ ఇచ్చే ఐఎండీబీ సంస్థ నుంచి హైడ్ అండ్ సీక్ 9.1 రేటింగ్ సాధించుకుంది. దీని బట్టి ఈ మూవీ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 10 నుంచే ఆహాలో హైడ్ అండ్ సీక్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపుగా మూడున్నర నెలల తర్వాత హైడ్ అండ్ సీక్ ఓటీటీలో రిలీజ్ అయింది. ఇదిలా ఉంటే, ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్స్‌కు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది.

బానిసలుగా చేసే గేమ్

అందుకే మొదటి సీన్ నుంచి సినిమా అయిపోయే వరకు ప్రేక్షకుడిని సీటులోంచి కదలనీయకుండా చేయడంలో దర్శకుడు మంచి సస్పెన్స్ మెయింటెన్ చేసినట్లు రివ్యూలు వచ్చాయి. ఆ మధ్య బ్లూవేల్ గేమ్ అని బాగా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. అలాంటి ఒక గేమ్ పిల్లలనే కాదు యువకులను కూడా ఎలా బానిసలుగా చేసి వారి లైఫ్‌లతో ఎలా ఆడుకుంటుందో కళ్లకు కట్టినట్లు ఇందులో చూపించారు.

మొదటి మర్డర్ నుంచి విరామం వరకు స్క్రీన్ ప్లే ఎంతో గ్రిప్పింగ్ రాసుకున్నారు. తరువాత ఏం జరగబోతుందో ఎవరి ఊహలకు అందనంతగా చక్కగా తెరపై దర్శకుడు ప్రెజెంట్ చేసినట్లు కామెంట్స్ వినిపించాయి. వరుస మర్డర్లు ఎందుకు జరగుతున్నాయి. దాని వెనకాల ఉన్న మోటివ్ ఏమిటన్నది ఈ సినిమాలో అసలు ట్విస్ట్.

పురాణాలకు లింక్ చేస్తూ

కథలో భాగంగా సినిమాలో క్యారెక్టర్స్ డిజైన్ చేయడం బాగుంది. పురాణాలలో ఒక కథకు లింక్ చేస్తూ చెప్పే విధానం ఆకట్టుకుంది. థియేటర్స్‌లో మిస్ అయిన ప్రేక్షకులు రెండు గంటల 16 నిమిషాల రన్ టైమ్ ఉన్న హైడ్ అండ్ సీక్ సినిమాను ఆహా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

సంబంధిత కథనం