Hi Nanna TV premier date: నాని హాయ్ నాన్న టీవీ ప్రీమియర్ డేట్ ఇదే.. ఎప్పుడు రానుందంటే?
Hi Nanna TV premier date: నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న మూవీ మొత్తానికి టీవీలోకి వచ్చేస్తోంది. తాజాగా ఈ సినిమాను టెలికాస్ట్ చేయనున్న జెమిని టీవీ టీవీ వరల్డ్ ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేసింది.
Hi Nanna TV premier date: హాయ్ నాన్న మూవీ థియేటర్లు, ఓటీటీలో సక్సెస్ అయిన తర్వాత ఇక ఇప్పుడు టీవీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. నెట్‌ఫ్లిక్స్ లో దుమ్మురేపిన ఈ మూవీ ఇప్పుడు జెమినీ టీవీలో టెలికాస్ట్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఛానెల్ శుక్రవారం (మార్చి 1) తన సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.
హాయ్ నాన్న టీవీ ప్రీమియర్ డేట్ ఇదే
నాని నటించిన హాయ్ నాన్న మూవీ మార్చి 17న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఉన్నట్లు జెమిని టీవీ వెల్లడించింది. శౌర్యువ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీవీ ప్రీమియర్ డేట్ ను సోషల్ మీడియా ఎక్స్ ద్వారా తెలిపింది. "మార్చి నెలకు హాయ్ నాన్న డేట్ తో స్వాగతం పలుకుతున్నాం. ఈ మార్చి 17న హాయ్ నాన్న మీకు ప్రేమ, నవ్వులు, లెక్కలేనన్న ఎమోషన్స్ ఇవ్వడానికి వస్తోంది" అనే క్యాప్షన్ తో జెమిని టీవీ హాయ్ నాన్న ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేసింది.
హాయ్ నాన్న మూవీలో నానితోపాటు మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా, జయరాం, ప్రియదర్శి, నాజర్, అంగద్ బేడీలాంటి నటీనటులు ఉన్నారు. వైరా ఎంటర్‌టైన్మెంట్స్ ఈ మూవీని నిర్మించింది. హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలోని ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
హాయ్ నాన్న నెట్‌ఫ్లిక్స్‌లో..
హాయ్ నాన్న సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. జనవరి 4వ తేదీన ఈ మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. తొలి వారం తెలుగుతో పాటు హిందీ వెర్షన్ ‘హాయ్ పాపా’కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టాప్-5లో ట్రెండ్ అయ్యాయి. అయితే, హిందీ వెర్షన్ జోరు మాత్రం 50 రోజులైన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. టాప్-10లో కంటిన్యూ అవుతోంది.
‘హాయ్ పాపా’ చిత్రం 50 రోజులుగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ఇండియా ట్రెండింగ్‍లో టాప్-10లోనే కొనసాగుతోంది. సోషల్ మీడియాలోనూ చాలా మంది హిందీ జనాలు ఈ చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు. నాని పర్ఫార్మెన్స్‌కు ఫిదా అవుతున్నారు. దీంతో హిందీలోనూ నేచులర్ స్టార్ మంచి పాపులర్ అయ్యారు. నాని తదుపరి మూవీ ‘సరిపోదా శనివారం’ కూడా పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ కానుంది.
హాయ్ నాన్న సినిమా తమ ప్లాట్‍ఫామ్‍లో భారీ వ్యూవర్‌షిప్ దక్కించుకోవడంతో ‘సరిపోదా శనివారం’ హక్కులను నెట్‍ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుందని సమాచారం బయటికి వచ్చింది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం రూ.45కోట్లను వెచ్చించిందట. ఇప్పటికే ఇలా ఓటీటీ హక్కుల విషయంలో ఈ మూవీకి కలిసి వచ్చింది. ‘సరిపోదా శనివారం’ హిందీ వెర్షన్ ‘సూర్యాస్ సాటర్‌డే’ థియేటర్లలోనూ సత్తాచాటుతుందని మూవీ టీమ్ నమ్మకంతో ఉంది.
టాపిక్