Hey Rangule Video Song: అమరన్ మూవీలోని సూపర్ హిట్ ‘హే రంగులే’ వీడియో సాంగ్ రిలీజ్.. పాట చూస్తే ప్రేమలో పడిపోతారు
Amaran Movie Hey Rangule Video Song: శివకార్తికేయన్, సాయి పల్లవి మధ్య ప్రేమ చిగురించే సన్నివేశాల్నిఒక పాటతో అమరన్ మూవీలో దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి చాలా అందంగా చూపించారు. ఒక్కసారి ఈ పాట చూస్తే..?
దీపావళి రోజున విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన అమరన్ మూవీ నుంచి ఒక వీడియో సాంగ్ రిలీజైంది. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ అమరన్ మూవీ పాజిటివ్ మౌత్ టాక్‌తో థియేటర్లలో ఇప్పటికీ సందడి చేస్తోంది.
రూ.250 కోట్ల క్లబ్‌లో అమరన్
కేరళ, కర్నాటకలో ఈ సినిమాకి ఆశించిన మేర వసూళ్లు రాకపోయినా.. తెలుగు, తమిళం మాత్రం భారీగానే కలెక్షన్లు రాబట్టింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు అమరన్ మూవీ రూ.250 కోట్లకుపైగానే వసూళ్లు రాబట్టింది. గురువారం సూర్య మూవీ కంగువా రిలీజ్ కాబోతుండటంతో.. ఇక అమరన్ థియేటర్లలో కనిపించడం కష్టమే.
ఉగ్రదాడిలో అసువులు బాసిన మేజర్ ముకుంద్ వరద రాజన్ జీవిత కథే ఈ అమరన్. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ అమరన్ సినిమాని సీనియర్ నటుడు కమల్ హాసన్.. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించారు. శివ కార్తికేయన్, సాయి పల్లవితో పాటు రాహుల్ బోస్, లల్లు, శ్రీకుమార్, శ్యామ్ మోహన్, భువన్ అరోడ తదితరులు మూవీలో నటించారు.
సాయి పల్లవి ఎక్స్‌ఫ్రెషన్స్‌కి ఫిదా
సినిమాలో శివ కార్తికేయన్, సాయి పల్లవి ప్రేమలో పడటాన్ని ఒకే ఒక పాటతో దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి చాలా అందంగా చూపించారు. ‘హే రంగులే’ అనే అంటూ సాగే ఆ పాటలో సాయి పల్లవి ఎక్స్‌ప్రెషన్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సాంగ్ కోసం యూత్ వెయిట్ చేస్తోంది.
శివ కార్తికేయన్, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ కూడా ఈ సాంగ్‌లోనే ఎక్కువగా కనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం ఈ సాంగ్‌కి మరింత బలాన్ని జోడించింది. ఈ పాటని చూస్తే సాయి పల్లవితో ప్రేమలో పడిపోతారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఓటీటీలోకి అమరన్ ఎప్పుడంటే?
అమరన్ మూవీ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకి సొంతం చేసుకుంది. అయితే.. నవంబరు చివర్లో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రాబోతున్నట్లు తొలుత ప్రచారం జరిగినా.. డిసెంబరు 11 వరకూ ఆగాల్సిందేనని తెలుస్తోంది.