Tamanna About Odela 2 Movie In Press Meet: మిల్కీ బ్యూటి తమన్నా నటించిన లేటెస్ట్ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓదెల్ 2. డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్‌గా అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఓదెల 2 సినిమాలో నాగ సాధువుగా, భైరవి పాత్రలో తమన్నా నటించారు.
ఏప్రిల్ 17న ఓదెల 2 మూవీ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా మార్చి 22న ఓదెల 2 రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఓదెల 2 ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ విశేషాలు పంచుకున్న తమన్నా భాటియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
హీరోయిన్ తమన్నా భాటియా మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఓదెల రైల్వే స్టేషన్ సినిమాని డైరెక్టర్ అశోక్ గారు చాలా అద్భుతంగా తీశారు. ఆ సినిమా చూసినప్పుడే దానికి పార్ట్ 2 ఉండాలని భావించాను. సంపత్ నంది గారు పార్ట్-2 ఐడియా చెప్పినప్పుడు ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఇది ఈజీ జోనర్ కాదు" అని చెప్పారు.
"ఒక పల్లెటూరి కథని ఇంత ఎగ్జైటింగ్‌గా, థ్రిల్లింగ్‌గా చెప్పడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ అశోక్ సినిమాని నెక్ట్స్ లెవెల్‌లో తీశారు. నేను ఏ సినిమా చేసిన ఆడియన్స్‌కి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఉండాలని కోరుకుంటాను. అలాంటి కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చే సినిమా ఇది" అని తమన్నా తెలిపారు.
"భైరవి క్యారెక్టర్ చేయడం యాక్టర్‌గా అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్‌లో హైయ్యెస్ట్ ఐషాట్ క్లోజప్స్ ఉన్న సినిమా ఇదే. భైరవి క్యారెక్టర్‌ని బిలెవబుల్, నేచురల్, మ్యాజికల్‌గా చూపించడం నిజంగా బిగ్ ఛాలెంజ్. మధు గారు సినిమాని చాలా గ్రాండ్‌గా నిర్మించారు. ఇది గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఉండే సినిమా. తప్పకుండా అందరికీ గ్రేట్ బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది" అని హీరోయిన్ తమన్నా చాలా నమ్మకంగా చెప్పారు.
ఇదే ప్రెస్ మీట్‌లో నటి పూజ మాట్లాడుతూ.. "ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన సంపత్ నంది గారికి, అశోక్ తేజ గారికి థాంక్యూ సో మచ్. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. ఇందులో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను. ఈ సినిమాని ఇంత గ్రాండ్‌గా నిర్మించిన నిర్మాత మధు గారికి ధన్యవాదాలు. అందరికీ థాంక్యూ సో మచ్" అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే, ఓదెల 2 రిలీజ్ డేట్ పోస్టర్‌లో తమన్నాను ఊహించని లుక్‌లో కనిపించింది. ఆభరణాలతో సాంప్రదాయ దుస్తులలో ధరించి, ఆమె ఒక సాధారణ మహిళగా కనిపిస్తునే ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్, గాయం గుర్తులు క్యారెక్టర్‌పై చాలా క్యురియాసిటీనీ పెంచాయి. వారణాసి నేపథ్యం మిస్టీరియస్ లేయర్‌ని యాడ్ చేస్తున్నాయి.
ఓదెల 2 సినిమాలో తమన్నాతోపాటు హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు. సౌందరరాజన్ ఎస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.
సంబంధిత కథనం