రూ. 4.3 కోట్ల లగ్జరీ అపార్ట్‌మెంట్ కొన్న హీరోయిన్ తాప్సీ.. ఎక్కడ, స్థలం ఎంతో తెలుసా?-heroine taapsee pannu buys rs 4 crore above worth luxury apartment in mumbai goregaon west with sister shagun pannu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  రూ. 4.3 కోట్ల లగ్జరీ అపార్ట్‌మెంట్ కొన్న హీరోయిన్ తాప్సీ.. ఎక్కడ, స్థలం ఎంతో తెలుసా?

రూ. 4.3 కోట్ల లగ్జరీ అపార్ట్‌మెంట్ కొన్న హీరోయిన్ తాప్సీ.. ఎక్కడ, స్థలం ఎంతో తెలుసా?

Sanjiv Kumar HT Telugu

టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్నీ తాజాగా రూ. 4.3 కోట్లతో లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, తన సోదరి షగున్ పన్నుతో కలిసి తాప్సీ కోట్లు ఖర్చు పెట్టి అపార్ట్‌మెంట్ కొన్నట్లుగా బాలీవుడ్ మీడియా పేర్కొంది. మరి తాప్సీ ఎక్కడ కొనుగోలు చేసింది, దాని స్థలమెంతో చూద్దాం.

రూ. 4.3 కోట్ల లగ్జరీ అపార్ట్‌మెంట్ కొన్న హీరోయిన్ తాప్సీ.. ఎక్కడ, స్థలం ఎంతో తెలుసా? (Tapsee Pannu/Instagram)

టాలీవుడ్‌లో ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస మూవీస్ చేస్తుంది. అయితే, తాజాగా తాప్సీ పన్ను రూ. 4.33 కోట్లతో లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది.

సోదరితో కలిసి

తాప్సీ తన సోదరి షగున్ పన్నుతో కలిసి ముంబైలో రూ. 4.33 కోట్లు ఖర్చు పెట్టి లగ్జరీ అపార్ట్‌మెంట్ కొన్నట్లుగా స్క్వేర్ యార్డ్స్ సమీక్షించిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (ఐజిఆర్) ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చెబుతున్నాయి. ముంబై గోరేగావ్ వెస్ట్‌లో 1,390 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అపార్ట్ మెంట్ ఉంది.

మొత్తం 1,669 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రాపర్టీని నిర్మించారు. అయితే, స్క్వేర్ యార్డ్స్ సమీక్షించిన ఐజిఆర్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం, ఈ ఆస్తి ఇంపీరియల్ హైట్స్ అని పిలువబడే రెడీ-టు-మూవ్-ఇన్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లో ఉంది.

21.65 లక్షల స్టాంప్ డ్యూటీ

రెండు కార్ పార్కింగ్ స్థలాలతో ఈ అపార్ట్‌మెంట్ వస్తుంది. అలాగే, హీరోయిన్ తాప్సీ రూ. 21.65 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించింది. ఈ లావాదేవీ 2025 మే 15న రిజిస్టర్ అయినట్లు డాక్యుమెంట్లలో చూపించారు. స్క్వేర్ యార్డ్స్ డేటా ఇంటెలిజెన్స్ ప్రకారం, ఇంపీరియల్ హైట్స్ ఏప్రిల్ 2024, మార్చి 2025 మధ్య 47 ఆస్తి లావాదేవీలు జరిగనట్లు వెల్లడించింది.

మొత్తం ఈ లావాదేవీల విలువ రూ. 168 కోట్లు అని ఐజిఆర్‌లో నమోదైంది. ప్రస్తుతం ప్రాజెక్టులో సగటు ప్రాపర్టీ ధర చదరపు అడుగుకు రూ.32,170గా ఉంది. ఇక ముంబైలోని అంధేరి, మలాడ్ వంటి ప్రధాన వాణిజ్య కేంద్రాల మధ్య వ్యూహాత్మకంగా ఉన్న గోరేగావ్ వెస్ట్, వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే, లింక్ రోడ్, ఎస్వి రోడ్, సబర్బన్ రైల్వే ద్వారా కనెక్టివిటీని అందిస్తుంది.

వేగంగా అభివృద్ధి

ఆఫీసు స్థలాలు, ఐటీ పార్కులు, కో-వర్కింగ్ హబ్‌లు, హై-స్ట్రీట్ రిటైల్, మాల్స్ డైనమిక్స్‌తో ఈ ప్రాంతం ఒక కీలక వాణిజ్య నివాస ప్రాంతంగా వేగంగా అభివృద్ధి చెందింది. ఇదిలా ఉంటే, తాను అపార్ట్‌మెంట్ కొనుగోలుపై హీరోయిన్ తాప్సీ కానీ, తన టీమ్ కానీ స్పందించలేదు.

ఇక మరో హీరోయిన్ అమృతా పురి, ఆమె కుటుంబం ముంబైలోని లోయర్ పరేల్‌లో రూ. 37 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. లోధా వరల్డ్ టవర్స్‌లోని 49వ అంతస్తులో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ విస్తీర్ణం 5,446 చదరపు అడుగులు.

10 కోట్ల విలువైన 3 అపార్ట్‌మెంట్స్

ఈ ఏడాది ప్రారంభంలో నటుడు, మోడల్ గౌహర్ ఖాన్ ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో రూ. 10.13 కోట్ల విలువైన మూడు అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేసినట్లు స్క్వేర్ యార్డ్స్‌కు లభించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు చెబుతున్నాయి.

వెర్సోవాలోని శివ్ కుటీర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ నుంచి ఈ మూడు అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లలో తేలింది. అపార్ట్ మెంట్ల విస్తీర్ణం 3,497 చదరపు అడుగులు (కార్పెట్ ఏరియా).

86.92 కోట్లతో హీరో

ఇక బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ 2025 జనవరిలో ముంబైలోని జుహు ప్రాంతంలో రూ. 86.92 కోట్ల విలువైన రెండు లగ్జరీ అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేసినట్లు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చూపించాయి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం