Balakrishna Samyuktha: బాలకృష్ణతో విరూపాక్ష హీరోయిన్ జోడీ.. బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌తో ఊహించని జంట!
Samyuktha Menon With Balakrishna In Akhanda 2: నందమూరి బాలకృష్ణతో విరూపాక్ష హీరోయిన్ సంయుక్త మీనన్ జత కట్టనుంది. అది కూడా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అయిన బాలయ్య-బోయపాటి శ్రీను అఖండ 2 సినిమాలో. బ్లాక్ బస్టర్ హిట్ మూవీకి సీక్వెల్‌లో సంయుక్త హీరోయిన్‌గా చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Balakrishna Samyuktha Menon Boyapati Akhanda 2: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ చిత్రం 'అఖండ 2: తాండవం' కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. వారి మునుపటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండకు ఈ సినిమా సీక్వెల్.

అధికారిక ప్రకటన
యాక్షన్, ఇంటెన్స్‌తో అఖండ 2 మూవీ నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన అఖండ 2 సినిమాను ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్‌ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
వరుస విజయాలతో
అఖండ 2 సినిమాలో వెరీ ట్యాలెంటెడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ ఫీమేల్ లీడ్‌గా ఎంపికయింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న సంయుక్త మీనన్ కొన్ని హై-ప్రొఫైల్ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. తన హీరోయిన్స్‌ని అద్భుతమైన పాత్రల్లో చూపించే బోయపాటి శ్రీను, సంయుక్తను చాలా క్రూషియల్ క్యారెక్టర్‌లో చూపించనున్నారని సమాచారం.
భారీ బడ్జెట్‌తో
ప్రస్తుతం అఖండ 2 సినిమా షూటింగ్ జరుగుతోంది. సీక్వెల్‌ను భారీ బడ్జెట్‌తో బిగ్ కాన్వాస్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ సి రాంప్రసాద్, ఎడిటర్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ వ్యవహరిస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఇద్దరికీ పాన్ ఇండియా స్థాయిలో అఖండ 2 ఇండియా అంతటా విడుదల కానుంది.
సంయుక్త మీనన్ సినిమాలు
సెప్టెంబర్ 25, 2025న దసరా సందర్భంగా అఖండ 2 థియేటర్లలోకి రానుంది. కాగా సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది సంయుక్త మీనన్. విరూపాక్షతోపాటు భీమ్లా నాయక్, బింబిసార, సార్ వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకుంది సంయుక్త మీనన్. అలాంటి సంయుక్త మీనన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అయిన బాలకృష్ణ-బోయపాటి శీను మూవీలో యాక్ట్ చేయనుంది.
ఊహించని కాంబినేషన్‌తో
అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న అఖండ2లో బాలకృష్ణతో సంయుక్త మీనన్ జోడీ కట్టడం ఎవరు ఊహించనివిధంగా ఉంది. మరి ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే, ఇటీవలే డాకు మహారాజ్ సినిమాతో బాలకృష్ణ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
డాకు మహారాజ్ రెస్పాన్స్
డైరెక్టర్ బాబీ కొల్లి అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహించిన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతోంది. కాగా, ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ యాక్ట్ చేయగా.. విలన్‌గా బాబీ డియోల్ చేశాడు.
సంబంధిత కథనం