Ritu Varma: 16 ఏళ్ల నా కెరీర్‌లో అలాంటి సీన్ చూడలేదని అన్నారు.. సీనియర్ నటుడిపై హీరోయిన్ రీతు వర్మ కామెంట్స్
Ritu Varma About Actor Rao Ramesh In Mazaka Movie: సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా నటించిన సినిమా మజాకా. తాజాగా మజాకా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రీతు వర్మ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు. సీనియర్ నటుడు రావు రమేష్ ఇచ్చిన కాంప్లిమెంట్స్‌పై రీతు వర్మ చెప్పుకొచ్చింది.

Ritu Varma About Rao Ramesh In Mazaka Movie: పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ మజాకా. సందీప్ కిషన్ సినీ కెరీర్‌లో 30వ సినిమాగా రానున్న మజాకా సినిమాకు ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మించారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ మాస్ ఎంటర్‌టైనర్ సినిమా మజాకాలో సందీప్ కిషన్‌కు జోడీగా రీతు వర్మ హీరోయిన్‌గా చేసింది. అలాగే, నాగార్జున మన్మధుడు హీరోయిన్ అన్షు, సీనియర్ నటుడు రావు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన మజాకా టీజర్, సాంగ్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ హైలీ ఎంటర్ టైనింగ్ మూవీ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రీతూ వర్మ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
ఈ సినిమా చేయడానికి మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి?
-ప్రసన్న గారు ఈ కథ చెప్పినపుడు చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. అదే సమయంలో కథ హై ఎమోషనల్ కోషేంట్‌గా ఉంది. రెండు ఫీమేల్ క్యారెక్టర్స్‌కి కథలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. నరేషన్ చాలా నచ్చింది. త్రూ అవుట్ నవ్వుతూనే ఉన్నాను.
సినిమాలో మీకు మెమరబుల్ మూమెంట్ అంటే?
-సెకండ్ హాఫ్‌లో నాకు రావు రమేష్ గారికి ఓ సింగిల్ టేక్ సీన్ ఉంది. ఆ రోజు షూట్ చేసినప్పుడు అవుట్‌పుట్ విషయంలో అందరూ చాలా హ్యాపీ అయ్యారు. సీన్ చాలా అద్భుతంగా వచ్చింది. రావు రమేష్ గారు డబ్బింగ్ పూర్తి చేసి ఫోన్ చేశారు. ఆ సీన్ గురించి మాట్లాడుతూ.. 'చాలా అద్భుతంగా చేశావ్ అమ్మా.. 16 నా ఏళ్ల కెరీర్‌లో అలాంటి సీన్ చూడలేదు' అని ఆయన చెప్పడం నాకు చాలా మెమరబుల్.
-ఈ సినిమా షూటింగ్ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. సెట్స్‌లో అందరూ ఎనర్జిటిక్‌గా ఉండేవారు. అదే ఎనర్జీ ప్రమోషన్స్‌లో కూడా కనిపిస్తుంది. బాటిల్ రీల్‌కి మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది.
త్రినాథ్ రావు గారి సినిమాలు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. ఈ సినిమా ఎలా ఉంటుంది?
-ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతుంది. లాట్స్ అఫ్ కామెడీ. హై ఆన్ ఎమోషన్. సాంగ్స్ చాలా గ్రాండియర్‌గా ఉంటాయి. టీజర్ అందరికీ నచ్చింది. చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు.
ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
-ఇందులో యంగ్ కాలేజ్ గర్ల్‌గా కనిపిస్తా. బాల్యంలో ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్ వలన తనపై ఎలాంటి ఎఫెక్ట్ పడింది? సందీప్ క్యారెక్టర్‌తో తన రిలేషన్‌షిప్ ?.. ఇలా చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్‌ని కొత్తగా ప్రజెంట్ చేశారు. ఇప్పటివరకూ చేయని క్యారెక్టర్‌లో కనిపిస్తా. ఆడియన్స్‌కి నచ్చుతుందనే నమ్మకం ఉంది.
సంబంధిత కథనం