Serial Actor: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ హీరోగా నటిస్తోన్న గీతా శంకరం మూవీ కొత్త పోస్టర్ రిలీజైంది. ఈ సినిమా పోస్టర్‌ను హీరోయిన్ ప్రియాంక శర్మ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నది. ప్రతి ప్రేమకథ గీతా శంకరం కాదు, కానీ మన గీతా శంకరం ప్రత్యేకం అంటూ పోస్టర్‌ను ఉద్దేశించి కామెంట్ పెట్టింది. గీతా శంకరం మూవీ పోస్టర్ సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ప్యూర్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న గీతా శంకరం సినిమాలో ముఖేష్ గౌడ, ప్రియాంక శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరోగా ముఖేష్ గౌడకు ఇదే తొలి సినిమా కావడం గమనార్హం.
ఈ సినిమాకు లక్ష్మణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలోని మట్టిబుర్ర అనే సాంగ్‌ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్వేత మోహన్ ఆలపించింది. ఈ సినిమాకు అబు మ్యూజిక్ అందిస్తోన్నాడు. గీతా శంకరం మూవీ షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఈ వేసవిలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతోన్నట్లు తెలిసింది.
గీతా శంకరంతో పాటు ప్రియమైన నాన్నకు పేరుతో మరో మూవీ చేస్తోన్నాడు ముఖేష్ గౌడ. తెలుగు, కన్నడ భాషల్లో బైలింగ్వల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రామేనహల్లి జగన్నాథ దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడంలో ఈ సినిమాకు తీర్థరూప తండేయావరిగే అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
సినిమాల కోసం గుప్పెడంత మనసు రిషి తన పేరునునిహార్ ముఖేష్‌గా మార్చుకున్నాడు. ముఖేష్ గౌడ పేరుతో సీరియల్స్ చేసిన రిషి...సినిమాల్లో మాత్రం నిహార్ ముఖేష్‌గా కొనసాగనున్నట్లు సమాచారం. గుప్పెడంత సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు ముఖేష్ గౌడ.
ఈ సీరియల్‌తో లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. గత ఏడాది ఆగస్ట్‌లో ఈ సీరియల్ ముగిసింది. గుప్పెడంత మనసు సీరియల్‌కు సీక్వెల్ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సీక్వెల్‌కు నిండు మనుసులు అనే టైటిల్ కన్ఫామ్ అయినట్లు సమాచారం.
సంబంధిత కథనం