మద్యం మత్తులో హీరోయిన్ కావ్యథాపర్ హల్ చల్… అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు-heroine kavya thapar arrested for abusing police ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మద్యం మత్తులో హీరోయిన్ కావ్యథాపర్ హల్ చల్… అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు

మద్యం మత్తులో హీరోయిన్ కావ్యథాపర్ హల్ చల్… అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు

Nelki Naresh HT Telugu

‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కథానాయిక కావ్యథాపర్ ను గురువారం ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో వాహనాన్ని నడిపి ఒకరిని గాయపరిచారనే ఆరోపణలపై పోలీసులు ఆమెను జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.

కావ్యథాపర్ (twitter)

బాలీవుడ్ లో హీరోయిన్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి తెలుగు చిత్రసీమవైపు అడుగులు వేసింది కావ్యథాపర్. ‘ఈ మాయ పేరేమిటో’, ‘ఎక్ మినీ కథ’ చిత్రాల్లో గ్లామర్ తళుకులతో ఆకట్టుకున్నది. ప్రస్తుతం సందీప్ కిషన్ తో తెలుగులో ఓ సినిమా చేస్తోన్న ఆమె చిక్కుల్లో పడింది. పోలీసులతో అనుచితంగా ప్రవర్తించడంతో జైలుపాలయ్యింది.  ముంబైలో గురువారం ఉదయం మద్యం మత్తులో కారు నడిపిన కావ్యథాపర్ ఓ వ్యక్తిని గాయపరచడమే కాకుండా పోలీసులతో  గొడవకు దిగినట్లు తెలిసింది. వారిని దూషించిందనే ఆరోపణలపై జుహూ పోలీసులు కావ్యథాపర్ ను అరెస్ట్ చేసి జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ‘తాత్కల్’ షార్ట్ ఫిలిమ్ ద్వారా నటిగా కావ్యథాపర్ పరిచయమైంది. ‘కాళీ పీళీ టేల్స్’ తో పాటు కొన్ని వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ వీడియోలలో ఆమె కనిపించింది.  ప్రస్తుతం తమిళంలో విజయ్ ఆంటోనీ సరసన ఓ సినిమాలో కథానాయికగా నటిస్తోంది కావ్యథాపర్.