40 ఏళ్లు వచ్చిన తర్వాత పొలిటిషియన్ అవ్వాలని ఉంది.. మ్యాడ్ హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ కామెంట్స్-heroine ananthika sanilkumar comments on political entry at age 40 years and 8 vasanthalu movie story ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  40 ఏళ్లు వచ్చిన తర్వాత పొలిటిషియన్ అవ్వాలని ఉంది.. మ్యాడ్ హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ కామెంట్స్

40 ఏళ్లు వచ్చిన తర్వాత పొలిటిషియన్ అవ్వాలని ఉంది.. మ్యాడ్ హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

మ్యాడ్ సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుందు బ్యూటిఫుల్ అనంతిక సనీల్ కుమార్. ఇప్పుడు అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్‌గా నటించిన మరో తెలుగు సినిమా 8 వసంతాలు. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా తాజాగా 8 వసంతాలు, తాను హీరోయిన్ కాకపోయింటే ఏం చేసేదో ఇంట్రెస్టింగ్‌గా చెప్పింది అనంతిక సనీల్ కుమార్.

40 ఏళ్లు వచ్చిన తర్వాత పొలిటిషియన్ అవ్వాలని ఉంది.. మ్యాడ్ హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ కామెంట్స్

పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన '8 వసంతాలు' ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్-సెంట్రిక్ మూవీ. సూపర్ హిట్ మూవీ మ్యాడ్ హీరోయిన్ అనంతిక సనీల్‌ కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు సోల్ ఫుల్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది.

8 వసంతాలు రిలీజ్ డేట్

ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. 8 వసంతాలు చిత్రం జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనంతిక సనీల్‌ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ మెటీరియల్ చూస్తుంటే ఈ కథంతా మీ చుట్టూనే ఉంటుందనిపిస్తుంది?

-ఇది విమెన్‌కి సంబంధించిన కథ. ఈ కథలో అమ్మాయి పాత్ర కీలకం అయినప్పటికీ మిగతా పాత్రలన్నిటికీ సమానంగా ప్రాముఖ్యత ఉంది. ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్. ప్రతి క్యారెక్టర్‌కి లేయర్స్ ఉంటాయి.

మ్యాడ్ తర్వాత ఈ సినిమాని ఎంచుకోవడానికి కారణం?

-మంచి కథ కోసం వెయిట్ చేశాను. ఈ కథలో నేను కోరుకున్న ప్రతిదీ ఉంది. నాకు యాక్షన్, బ్యూటిఫుల్ లవ్ స్టొరీ చేయాలని ఉండేది. అవన్నీ కూడా ఈ కథలోనే కుదిరాయి. పర్ఫామెన్స్ చేయడానికి చాలా మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్.

-8 వసంతాలు కథ చదివినప్పుడు చాలా కనెక్ట్ అయ్యాను. లిటరల్‌గా ఏడ్చేశాను. అంత ఎమోషనల్ డెప్త్ ఉన్న కథ ఇది. నేను శుద్ధి యోగ్య పాత్రలో కనిపిస్తాను. తను ఒక రచయిత అలాగే తనకి మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం కూడా ఉంటుంది.

మీరు యాక్టర్ కాకపోయినా ఇంకేం అయ్యేవారు?

-పొలిటీషియన్ అవ్వాలనేది నా కోరిక. అందుకే లా చదువుతున్నాను. అయితే అది ఇప్పుడు కాదు. నాకు ఒక 40 ఏళ్లు వచ్చిన తర్వాత (నవ్వుతూ).

ఈ ప్రేమ కథలో ప్రత్యేకత ఏమిటి ?

-చాలా ప్యూర్ లవ్ స్టోరీ ఇది. ఒక రియల్ జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. అన్ని ఏజ్ గ్రూప్స్‌కి రిలేట్ అవుతుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం