OTT Villains: ఓటీటీలో ఈ ఏడాది విలన్స్‌గా మెప్పించిన హీరోల సినిమాలు.. ఇవాళ రిలీజైన కీర్తి సురేష్ మూవీతో సహా స్ట్రీమింగ్?
Heroes As Villain Movies OTT Platforms In 2024: 2024 సంవత్సరంలో చాలా మంది స్టార్ హీరోలు విలన్స్ రోల్స్ చేసి మెప్పించారు. వాటిలో డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాతోపాటు ఇవాళ థియేట్రికల్ రిలీజైన కీర్తి సురేష్ మూవీ బేబీ జాన్ కూడా ఉంది. మరి ఆ హీరోలు, ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై లుక్కేద్దాం.
Heroes As Villain Movies OTT In This Year: 2024 సంవత్సరానికి మరికొన్ని రోజుల్లో గుడ్ బై చెప్పేసి న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పేందుకు అంతా సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అట్రాక్ట్ చేసే సినిమాలు, హీరోలు, విలన్స్ గురించి ఇయర్ ఎండర్ 2024లో భాగంగా ఇక్కడ చెప్పుకుందాం.
అయితే, హీరోలుగా మెప్పించిన కొంతమంది విలన్స్ రోల్స్ కూడా వేసి ఆకట్టుకున్నారు. అలా 2024 సంవత్సరంలో విలన్స్‌గా మెప్పించిన హీరోల సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
సెక్టార్ 36 ఓటీటీ
బాలీవుడ్ పాపులర్ ఓటీటీ హీరోల్లో విక్రాంత్ మాస్సే ఒకరు. 12th ఫెయిల్, హసీన్ దిల్‌రుబా, పిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా, ఫొరెన్సిక్ వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో విలన్‌గా నటించిన డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సెక్టార్ 36. సెప్టెంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది సెక్టార్ 36 సినిమా.
సింగమ్ ఎగైన్ ఓటీటీ
బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ విలన్‌గా మెప్పించిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సింగమ్ ఎగైన్. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ నుంచి వచ్చిన ఐదో సినిమా ఇది. ఈ సినిమాతో తొలి సారిగా ఒక హీరోయిన్‌ను పోలీస్ రోల్‌లో చూపించాడు డైరెక్టర్ రోహిత్ శెట్టి.
దీపికా పదుకొణె, అజయ్ దేవగన్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్స్ నటించిన సింగమ్ ఎగైన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
కంగువా ఓటీటీ
యానిమల్ మూవీతో విలన్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ హీరో బాబీ డియోల్ మరోసారి ప్రతినాయకుడిగా నటించిన పాన్ ఇండియా సినిమా కంగువా. తమిళ స్టార్ హీరో సూర్య, హీరోయిన్ దిశా పటానీ నటించిన కంగువా అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది.
కల్కి 2898 ఏడీ ఓటీటీ
ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ ప్రధాన పాత్రలుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తన విలనిజంతో ఆకట్టుకున్న కల్కి 2898 ఏడీ అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
షైతాన్ ఓటీటీ
తమిళ హీరో ఆర్ మాధవన్ కరుడుకట్టిన మాంత్రికుడిగా నటించి మెప్పించిన బాలీవుడ్ హారర్ థ్రిల్లర్ డ్రామా షైతాన్. అజయ్ దేవగన్, జ్యోతిక భార్యాభర్తలుగా నటించిన షైతాన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్.
బేబీ జాన్ ఓటీటీ
కీర్తి సురేష్, వరుణ్ ధావన్, వామికా గబ్బి మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బేబీ జాన్. డైరెక్టర్ అట్లీ నిర్మించిన బేబీ జాన్ ఇవాళ (డిసెంబర్ 25) థియేటర్లలో విడుదలైంది. ఇందులో ఒకప్పటి హీరో జాకీ ష్రాఫ్ విలన్ బబ్బర్ షేర్ పాత్రలో మెప్పించినట్లు సమాచారం.
ఇవాళే థియేటర్లలో విడుదలైన కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ బేబీ జాన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ అని టాక్. థియేట్రికల్ రన్ తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో బేబీ జాన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం.