Venkatesh About Aishwarya Rajesh Compared To Soundarya: ఫ్యామిలీ హీరో, విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ కుటుంబా కథా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్‌తో దూసుకుపోతోన్న సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ టీమ్ బాక్సాఫీస్ సంభవం క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
-వండర్‌ఫుల్ హ్యాపీ ఫీలింగ్. సంక్రాంతికి హానెస్ట్‌గా ఓ ఫ్యామిలీ సినిమా ఇవ్వాలని అనుకున్నాం. కానీ, ఆడియన్స్ సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లారు. చాలా సపోర్ట్, ఎంకరేజ్‌మెంట్ ఇచ్చారు. హిట్ కాదు.. ట్రిపుల్ బ్లాక్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఈ సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్‌కి థాంక్ యూ.
-ఈ సినిమా చేస్తున్నప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండేది. ఈ సినిమా జర్నీ ఒక మ్యాజికల్‌గా అనిపించింది. అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఇదంతా డివైన్ ఎనర్జీగా భావిస్తున్నాను.
-భీమ్స్‌లో నాకు నచ్చే క్యాలిటీ దర్శకుడి కావాల్సిన మ్యూజిక్ ఇవ్వడం. ఈ పొంగల్‌తో భీమ్స్ టైం మొదలైయింది. నెక్ట్స్ పదేళ్లు తనదే. తనతో నా జర్నీ ఉంటుంది.
-నేను తొలిసారి కలిసినప్పుడు అనిల్ ఓ రైటర్. తనలో అప్పుడే ఒక స్పార్క్ కనిపించింది. మా మధ్య మంచి రేపో ఉంది. తనతో ఎప్పుడూ ఓ ఫ్రెండ్ లానే ఉంటాను. మేము చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాం, అందుకే రిజల్ట్ ఇంత పాజిటివ్‌గా ఉంటుంది. తను చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు.
-ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా పర్ఫామ్ చేసింది. తనకి మంచి రోల్ దొరికింది. తను చాలా అనుభవం ఉన్న నటి. ఈ జోనర్ చేయడం తనకి కొత్త. అనిల్ చాలా చక్కని పర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు.
సంబంధిత కథనం