అలా చేయడమంటే డబ్బులతో పోరాటం.. ప్రేమ ఇవ్వరా అనే గుడ్డి కోరిక.. హీరో సందీప్ కిషన్ కామెంట్స్-hero sundeep kishan comments on naveen chandra eleven movie in pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  అలా చేయడమంటే డబ్బులతో పోరాటం.. ప్రేమ ఇవ్వరా అనే గుడ్డి కోరిక.. హీరో సందీప్ కిషన్ కామెంట్స్

అలా చేయడమంటే డబ్బులతో పోరాటం.. ప్రేమ ఇవ్వరా అనే గుడ్డి కోరిక.. హీరో సందీప్ కిషన్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

హీరో నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా లెవెన్. లోకేష్ అజ్ల్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 16న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం లెవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

అలా చేయడమంటే డబ్బులతో పోరాటం.. ప్రేమ ఇవ్వరా అనే గుడ్డి కోరిక.. హీరో సందీప్ కిషన్ కామెంట్స్

నవీన్ చంద్ర హీరోగా నటించిన తెలుగు, తమిళ బైలింగువల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ లెవెన్. సుందర్ సి వద్ద కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ లెవెన్ సినిమాకు దర్శకత్వం వహించారు.

విమర్శకుల ప్రశంసలు పొందిన

ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించిన లెవెన్ విమర్శకుల ప్రశంసలు పొందిన సిలా నేరంగలిల్ సిలా మణిధర్గల్, సెంబి చిత్రాల విజయం తర్వాత వారి మూడవ వెంచర్. మే 16న లెవెన్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన లెవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో సందీప్ కిషన్ చీఫ్ గెస్ట్‌గా హాజరై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

సీజ్ ఫైర్ తర్వాత

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. సీజ్ ఫైర్ సమాచారం వచ్చిన తర్వాత ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. మన కోసం ప్రాణం పెట్టి పోరాడుతున్న ఇండియన్ ఆర్మీకి బిగ్ సెల్యూట్. ఒక నటుడిగా సైనికులకి ఎంత సహాయం చేయగలనో అది చేస్తాను. మీరు కూడా మీ వంతు కుదిరిన సహాయం చేయాలని కోరుకుంటున్నాను. వారు మన సహాయం కోసం ఆధారపడలేదు. వారి త్యాగానికి ఇది మన బాధ్యత" అని అన్నాడు.

కష్టాన్ని నమ్ముకున్న యాక్టర్

"సినిమా విషయానికొస్తే.. ఈ వేడుకకు వచ్చే ముందు ఇది నవీన్ సినిమా. టైటిల్ లెవెన్ ఇదొక్కటి మాత్రమే నాకు తెలుసు. తనకి మంచి జరగాలని సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నాను. నవీన్ నాకంటే సీనియర్. తన ప్రతి సినిమా తన టాలెంట్‌తోనే తెచ్చుకున్నాడు. ఆడిషన్స్ ఇచ్చే తెచ్చుకున్నాడు. తన ప్రతిభను గుర్తించే అవకాశం వచ్చింది. అదృష్టాన్ని కాకుండా కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకున్న యాక్టర్ నవీన్" అని సందీప్ కిషన్ తెలిపాడు.

ప్రతి సీన్ 2 సార్లు

"తన ప్రతి సినిమాలో ద బెస్ట్ పర్ఫామెన్స్ ఉంటుంది. నవీన్‌కి ఇది గుడ్ డే. తెలుగు తమిళ్ బైలింగువల్ చేయడం అంటే డబ్బులతో పోరాటం. ప్రతి సీన్ 2 సార్లు చేయాలి. రెండు చోట్ల ప్రమోషన్ చేయాలి. ఇది తెలుగు సినిమానా తమిళ్ సినిమానా అని ప్రతి ఒక్కరికి వివరణ ఇచ్చుకోవాలి. ఇవన్నీ దాటి కూడా చేయడానికి కారణం అక్కడున్న ఆడియన్స్ పట్ల, భాష పట్ల ప్రేమ. ఆడియన్స్ మన కష్టానికి తగిన ప్రేమ ఇవ్వరా అనే ఒక గుడ్డి కోరిక" అని సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు.

డైరెక్టర్ లోకేష్

"ఈ సినిమా నవీన్‌కి చాలా మంచి సక్సెస్ ఇస్తుందని కోరుకుంటున్నాను. సినిమా మీద విపరీతమైన పాషన్ ఉంటేనే ఇలాంటి సినిమాలు వస్తాయి. ఈ సినిమా ట్రైలర్ చూశాను ట్రైలర్‌లో క్రాఫ్ట్ చాలా బాగుంది. డైరెక్టర్ లోకేష్ చాలా అద్భుతంగా సినిమాని తీసాడు అనిపించింది. ఇది కథని కంటెంట్‌ని నమ్ముకుని చేసిన సినిమా. నటీనటులు టెక్నీషియన్స్ ద బెస్ట్ ఇచ్చారని అనిపిస్తోంది" అని సందీప్ కిషన్ వెల్లడించాడు.

మంచి హిట్ రావాలని

"ఇమాన్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఫస్ట్ తెలుగు సినిమా నాతోనే చేశారు. ఆయన మరిన్ని తెలుగు సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మే 16న ఈ సినిమా రాబోతుంది. అందరూ థియేటర్స్‌లో చూడండి. నవీన్‌కి ఒక మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను" అని హీరో సందీప్ కిషన్ తన స్పీచ్ ముగించాడు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం