Srikanth: రాశీ అందుకే కొట్టింది, హీరోయిన్లతో ఎఫైర్స్‌పై హీరో శ్రీకాంత్ ఓపెన్ కామెంట్స్
Actor Srikanth About Affairs With Heroines: భార్య ఊహతో విడాకులు, హీరోయిన్లతో ఎఫైర్లపై సీనియర్ హీరో శ్రీకాంత్ తాజాగా ఓపెన్ కామెంట్స్ చేశాడు. అలాగే హీరోయిన్ రాశీ తనను కొట్డడానికి గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు శ్రీకాంత్ మేక.

Actor Srikanth About Divorce With Ooha: సీనియర్ హీరో శ్రీకాంత్‌కు మంచి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శ్రీకాంత్‌పై మనసు పారేసుకున్న హీరోయిన్స్ కూడా చాలా మందే ఉన్నారని ఇండస్ట్రీలో టాక్. అయితే ఆ మధ్య భార్య ఊహతో శ్రీకాంత్‌కు విడాకులు అంటూ వార్తలు వచ్చాయి. అలాగే ఆ మధ్య ఒక ఈవెంట్‌లో హీరోయిన్ రాశీతో శ్రీకాంత్ చనువుగా ఉన్న వీడియో వైరల్ కావడంతో వారి మధ్య సమ్‌థింగ్ ఉందని టాక్ నడిచింది.
ఎవరో రాసింది కాదు
తాజాగా తమ్మారెడ్డి భరద్వాజాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఈ విషయాలపై ఓపెన్‌గా చెప్పాడు. "సినిమా హీరోలంటే హీరోయిన్లతో ఎఫైర్లు ఉంటాయని అంటారు కదా. పెళ్లికి ముందు నీకు ఎంతమందితో ఎఫైర్ ఉంది" అని తమ్మారెడ్డి అడిగారు. "నాకు ఎంతమందితో ఎఫైర్ ఉందో మీకు తెలియదా. హీరోని చేసింది మీరే కదా. బయట ఎవరో ఏదో రాసింది అడిగితే కాదు. మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చిందా చెప్పండి" అని తిరిగి శ్రీకాంత్ ప్రశ్నించాడు.
నాకు సంబంధం లేదు
"నువ్ మంచోడివనే అనుకున్నా. కానీ, బయట అనుకుంటున్నారు కదా" అని తమ్మారెడ్డి అన్నారు. "వాళ్లేదో అనుకుంటే నాకు సంబంధం లేదు. మొన్న రాశీ నేను ఏదో ఫంక్షన్‌కు వెళ్తే ఏదేదో అనుకున్నారు" అని శ్రీకాంత్ అన్నాడు. "అవునూ.. నిన్ను పిచ్చకొట్టుడు కొడుతుంది ఏంటీ" అని భరద్వాజా నవ్వుతూ అడిగారు.
ఇలా స్ట్రగుల్ పడలేదు
"అదా.. మేం ఇద్దరం ఓ ఫంక్షన్‌కు వెళ్లాం. చాలా ఏళ్ల తర్వాత కలిశాం. అక్కడికి వచ్చిన ఈ హీరోయిన్ రాశీని చూసి రాశి అమ్మా అని అంది. నాకు నవ్వు వచ్చింది. అప్పుడే అమ్మని చేసేశారా అని. నేను కూడా రాశి అమ్మా అని అన్నాను. దానికి ఆమె సరదాగా కొట్టింది. అంతకుమించి ఏం లేదు. చాలా ఏళ్లు పగలూ రాత్రుళ్లు షూటింగ్ చేశాను. కానీ, ఇలాంటి స్ట్రగుల్ నా జీవితంలోనే పడలేదు. నాకు ఆ ధ్యాస (ఎఫైర్స్‌పై) లేదు" అని శ్రీకాంత్ చెప్పాడు.
షాక్ అయ్యాం
"నేను నటించిన వాళ్లలో సౌందర్య, రాశీతో అలా చాలామందితో కంఫర్ట్‌గా ఉండేది. నా కోస్టార్స్ అంతా మా ఇంటికి వస్తుంటారు. ఫ్యామిలీ రిలేషన్ ఉంది. ఊహకు నాకు విడాకులు అయిపోయాయని చాలా పుకార్లు వచ్చాయి. టీవీలలో బ్రేకింగ్‌లు కూడా వచ్చాయి. అప్పుడు మేం అరుణాచలం వెళ్తుంటే మా విడాకుల వార్త చూసి షాక్ అయ్యాం. తర్వాత ఆ వార్తలను ఖండించాం" అని హీరో శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.