ఇది చాలా కొత్త క్లైమాక్స్.. హైదరాబాద్‌ను ఇంత కొత్తగా ఇప్పటివరకు ఎవరు చూపించలేదు.. హీరో శ్రీ విష్ణు కామెంట్స్-hero sree vishnu comments on single movie climax says its new and hyderabad heroines ketika sharma ivana geetha arts ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఇది చాలా కొత్త క్లైమాక్స్.. హైదరాబాద్‌ను ఇంత కొత్తగా ఇప్పటివరకు ఎవరు చూపించలేదు.. హీరో శ్రీ విష్ణు కామెంట్స్

ఇది చాలా కొత్త క్లైమాక్స్.. హైదరాబాద్‌ను ఇంత కొత్తగా ఇప్పటివరకు ఎవరు చూపించలేదు.. హీరో శ్రీ విష్ణు కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

హీరో శ్రీ విష్ణు లేటెస్ట్‌గా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా సింగిల్. ఇందులో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్‌గా చేశారు. అల్లు అరవింద్ నిర్మాణంలో కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన సింగిల్ మే 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు ఇంట్రెస్టింగ్ సినీ విశేషాలు చెప్పాడు.

ఇది చాలా కొత్త క్లైమాక్స్.. హైదరాబాద్‌ను ఇంత కొత్తగా ఇప్పటివరకు ఎవరు చూపించలేదు.. హీరో శ్రీ విష్ణు కామెంట్స్

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ చిత్రం సింగిల్. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో కల్యాణ్ ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు.

ఇద్దరు హీరోయిన్స్

శ్రీవిష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్‌గా చేయగా.. వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించాడు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన సింగిల్ మూవీ మే 9న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హీరో శ్రీ విష్ణు ఇంట్రెస్టింగ్ సినీ విశేషాలను పంచుకున్నాడు.

కొత్త కథ, స్క్రీన్ ప్లే

-అందరికీ నమస్కారం. మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. మే 9న సింగిల్ సినిమా రిలీజ్ కాబోతుంది. మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుల్ని నవ్వించాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. కొత్త కథ, స్క్రీన్ ప్లే ఉంటుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.

మనం రిలేట్ చేసుకునేలా

- సింగిల్ ఇంటర్వెల్, క్లైమాక్స్ కొత్తగా ఉంటాయి. అన్ని సన్నివేశాలు కూడా మనల్ని మనం రిలేట్ చేసుకునేలా ఉంటాయి. యంగ్‌స్టర్స్ అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా సినిమా చూడొచ్చు. మేము అనుకున్నది స్క్రీన్ మీదకి చాలా అద్భుతంగా వచ్చింది. ఆడియన్స్ సినిమా చూసి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.

-గీతా ఆర్ట్స్‌లో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎప్పటినుంచో గీతా ఆర్ట్స్‌లో చేయాలి అనుకుంటున్నా. లక్కీగా ఈ సినిమాతో కుదిరింది. 100% కాన్ఫిడెన్స్ ఉన్న జోనర్ ఇది. ఈ జోనర్‌లో గీత ఆర్ట్స్‌తో చేయడం వెరీ వెరీ హ్యాపీ.

రెండేళ్లుగా

-డైరెక్టర్ కార్తీక్ రాజు గారితో నాకు టూ ఇయర్స్ ట్రావెల్ ఉంది. చాలా మంచి టీంతో కలిసి సినిమా చేశాం. సినిమా చూసి అందరూ హ్యాపీగా నవ్వుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

-ఇప్పటివరకు విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. ఇదంతా టీమ్ ఎఫర్ట్ అని భావిస్తున్నాను.

డైరెక్టర్ గారు ఈ సినిమా కథ చెప్పినప్పుడు, ఫైనల్ అవుట్‌పుట్ చూసుకున్నాక మీకు ఎలా అనిపించింది?

-కథ చెప్పినప్పుడు చాలా మంచి ఎంటర్‌టైనర్ అవుతుందని నమ్మకం కలిగింది. ఫైనల్‌గా సినిమా చూసుకున్న తర్వాత చాలా పెద్ద ఎంటర్‌టైనర్ అవుతుందని అనిపించింది.

టైటిల్ సింగల్ అన్నారు.. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు?

-చాలా కొత్త క్లైమాక్స్ ఇది. అందరికీ నచ్చుతుంది. నా క్యారెక్టర్, వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్. ఇద్దరు హీరోయిన్స్ క్యారెక్టర్స్‌ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ నాలుగు క్యారెక్టర్లు కూడా ఆడియన్స్‌కి చాలా నచ్చుతాయి. క్లైమాక్స్ చాలా యూనిక్‌గా ఉంటుంది. అందరిని ఎంటర్టైన్ చేస్తుంది.

-సినిమాని కంప్లీట్‌గా హైదరాబాద్‌లో తీసాం. హైదరాబాద్‌ను చాలా కొత్తగా చూపించాం. ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌ని ఇంత కొత్తగా ఎవరు చూపించలేదు. చాలా బెస్ట్ మూమెంట్స్‌ని క్యాప్చర్ చేశాం.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం