నెక్ట్స్ జెనరేషన్ కిడ్స్ రాబోతున్నారు.. ఆ మార్పుకు సిద్ధంగా ఉన్నా.. హీరో శ్రీ విష్ణు కామెంట్స్-hero sree vishnu comments on next generation kids and revolution in single movie promotional interview ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నెక్ట్స్ జెనరేషన్ కిడ్స్ రాబోతున్నారు.. ఆ మార్పుకు సిద్ధంగా ఉన్నా.. హీరో శ్రీ విష్ణు కామెంట్స్

నెక్ట్స్ జెనరేషన్ కిడ్స్ రాబోతున్నారు.. ఆ మార్పుకు సిద్ధంగా ఉన్నా.. హీరో శ్రీ విష్ణు కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్‌గా శ్రీ విష్ణు సరసన జోడీ కట్టారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన సింగిల్ మూవీ ఇవాళ థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీ విష్ణు ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు.

నెక్ట్స్ జెనరేషన్ కిడ్స్ రాబోతున్నారు.. ఆ మార్పుకు సిద్ధంగా ఉన్నా.. హీరో శ్రీ విష్ణు కామెంట్స్

హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ చిత్రం సింగిల్. అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో సింగిల్ మూవీ తెరకెక్కింది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన సింగిల్ సినిమాలో శ్రీ విష్ణుకు జోడీగా కేతిక శర్మ, ఇవానా ఇద్దరు హీరోయిన్స్‌గా చేశారు. కమెడియన్ వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించాడు.

ఇవాళ (మే 9) థియేటర్లలో చాలా గ్రాండ్‌గా సింగిల్ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్‌కు ముందు పలు ప్రమోషన్స్‌లో పాల్గొన్న హీరో శ్రీ విష్ణు సింగిల్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నాడు.

వెన్నెల కిశోర్ గారి క్యారెక్టర్ గురించి?

-మా ఇద్దరిలో ఎవరి క్యారెక్టర్ లేకపోయినా ఈ సినిమా లేదు. సినిమా చూసిన తర్వాత అది మీకే అనిపిస్తుంది. వెన్నెల కిశోర్ గారు వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్టుని 100% చేస్తున్నామని భావించాం.

మీరు ఒక క్యారెక్టర్‌కి ఒక క్యారెక్టర్‌కి ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్‌ని ఎలా చూస్తారు?

-నేను ప్రతి క్యారెక్టర్‌నీ ఎంజాయ్ చేస్తాను. డైరెక్టర్‌తోనే ఎక్కువ ట్రావెల్ చేస్తాను. ఆ ట్రావెల్‌‌లోనే 50% వచ్చేస్తుంది. తర్వాత లొకేషన్‌లో ఇంకొంత క్యారెక్టర్ మీద కమాండ్ పెరుగుతుంది.

మీరు డైలాగ్స్‌లో సపరేట్‌గా ఒక డిక్షన్ సృష్టించుకున్నారు. దానికోసం ఎలాంటి ప్రాక్టీస్ చేస్తుంటారు?

-ముఖ్యంగా యంగ్‌స్టర్స్‌కి ఆ డైలాగ్ డిక్షన్‌ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ల కోసం నేను సపరేట్‌గా కేర్ తీసుకుని చేస్తున్నాను. వీలైనంతవరకు ప్రేక్షకుల్ని నవ్వించాలనేది నా ఉద్దేశం.

ఈ సినిమాలో మీ బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటుందా?

-అవునండి. ఇది ఒక లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీలో ఉన్న ఫ్రెష్‌నెస్ బాడీ లాంగ్వేజ్‌లో కూడా ఉంటుంది. గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌ను ఆడియన్స్ చూస్తారు.

ఏదైనా ఒక స్టైల్ కొన్ని రోజుల తర్వాత బోర్ కొట్టేస్తుంది కదా. ఫ్యూచర్‌లో ఒక కొత్త స్టైల్‌ని పట్టుకోవడానికి మీ వైపు నుంచి ఎలాంటి ప్రయత్నం చేస్తుంటారు?

-నేను ఇండస్ట్రీకి వచ్చి పదహారేళ్లు అవుతుంది. ఈ పదహారేళ్లలో ఎక్కడ కూడా బోర్ కొట్టించని సినిమాలే చేశానని భావిస్తున్నాను. రానున్న రొజులలో చాలా మార్పులు రాబోతున్నాయి. పెద్ద రెవల్యూషన్ రాబోతుంది. నెక్ట్స్ జనరేషన్ కిడ్స్ రాబోతున్నారు. ఆ మార్పుకి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతి క్యారెక్టర్‌లో ది బెస్ట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను.

విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ గురించి?

-సినిమా ఒక హైపర్ ఎనర్జీతో వచ్చింది. దానికి తగ్గట్టు ఆయన ఎనర్జిటిక్ సాంగ్స్ ఇచ్చారు. ఆర్ఆర్ చాలా బాగా చేశారు. చాలా కొత్తగా ఉంటుంది. చాలా ఇన్నోవేటివ్ సౌండ్ ఉంటుంది

-వేల్ రాజ్ గారు సూపర్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు. ఆయన హైదరాబాద్‌ని చాలా కొత్తగా చూశారు. ఆ కొత్తదనాన్ని ఆడియన్స్ స్క్రీన్ మీద చూడబోతున్నారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం