హీరో సిద్ధార్థ్ 40వ మూవీ '3 బీహెచ్‌కే'. ఈ సినిమాకు శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. పోస్టర్లు, టీజర్లు, పాటలతో 3 బీహెచ్‌కే సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా, దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మాతగా నిర్మించిన 3 బీహెచ్‌కే చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 3 బీహెచ్‌కే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సిద్ధార్థ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
"నా వాల్యూని తెలుగు ప్రేక్షకులే మొదటగా చూశారు. ఎప్పుడు కూడా వారే గొప్ప ప్రేమని చూపించారు. అది ఎప్పటికి మారదు. మారకూడదు. ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ స్టోరీ. మీకు ట్రైలర్ నచ్చితే కచ్చితంగా వెళ్లండి. చాలా ప్రేమతో ఈ సినిమా తీశాం. చైత్ర, మీతా అందరూ మీ ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తున్నారు" అని సిద్ధార్థ్ అన్నాడు.
"ఒక హానెస్ట్ ఫ్యామిలీ ఫిలిం తీయడం చాలా కష్టం. అలాంటి మంచి సినిమా ఇది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఇందులో మంచి హోప్ ఉంది. థియేటర్ నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఒక పాజిటివ్ హోప్‌తో వెళ్తారు. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ. చాలా ప్రేమతో పని చేశారు" అని హీరో సిద్ధార్థ్ తెలిపాడు.
"ప్రొడ్యూసర్ అరుణ్ ఇప్పుడు ఉంటున్న ఇల్లు గతంలో కళాతపస్వి కె విశ్వనాథ్ గారు ఉండేవారు. ఈ సినిమాని కళాతపస్వి కె. విశ్వనాథ్ గారికి అంకితం చేస్తున్నాం. సినిమాని రిలీజ్ చేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూషన్ వారికి ధన్యవాదాలు" అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు.
"ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. ఇల్లు అనేది ఒక డ్రీమ్. అలాంటి ఎమోషన్స్‌ని ఈ సినిమా మీ అందరికీ ఇస్తుంది. జూలై 4న తప్పకుండా మీరందరూ ఆ ఎమోషన్‌ని ఎక్స్‌పీరియెన్స్ చేస్తారు. మీ అందరి ప్రేమకి థాంక్యూ" అని హీరో సిద్ధార్థ్ తన స్పీచ్ ముగించాడు.
ఇదే ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. మైత్రి డిస్ట్రిబ్యూషన్‌లో ఈ సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్‌కి థాంక్యూ" అని అన్నారు.
"ఇంతకుముందు మహావీరుడు చేశాను. ఆ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా తెలుగు నుంచి వచ్చిన రెస్పాన్స్ స్పెషల్ ఫీలింగ్. ఈ సినిమా కూడా అంతకంటే మంచి రెస్పాన్స్ తీసుకొస్తుందని నమ్మకం ఉంది" అని నిర్మాత అరుణ్ విశ్వ చెప్పారు.
"ఈ పాత్రను చేసిన సిద్ధార్థ్‌కి థాంక్యూ. తను నాకు బ్రదర్ లాంటి వారు. శరత్ కుమార్ గారికి, దేవయాని గారికి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. శ్రీ గణేష్ చాలా అద్భుతంగా ఈ సినిమాని తీశారు. ఈ సినిమా నా జీవితంలో ఎప్పటికీ మెమొరబుల్‌గా నిలిచిపోతుంది" అని 3 బీహెచ్‌కే నిర్మాత అరుణ్ విశ్వ తెలిపారు.
సంబంధిత కథనం