Hero Shivaji: సీఎం అవడం ఆ ఫ్యామిలీకి పెద్ద కష్టం కాదు.. కానీ: హీరో శివాజీ కామెంట్స్-hero shivaji about pawan kalyan family in 90s web series trailer launch event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hero Shivaji: సీఎం అవడం ఆ ఫ్యామిలీకి పెద్ద కష్టం కాదు.. కానీ: హీరో శివాజీ కామెంట్స్

Hero Shivaji: సీఎం అవడం ఆ ఫ్యామిలీకి పెద్ద కష్టం కాదు.. కానీ: హీరో శివాజీ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Hero Shivaji At #90s Web Series Trailer Launch: బిగ్ బాస్ 7 తెలుగు కంటెస్టెంట్, హీరో శివాజీ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. #90s వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్‌లో ఓ ఫ్యామిలీపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సీఎం అవడం ఆ ఫ్యామిలీకి పెద్ద కష్టం కాదు.. కానీ: హీరో శివాజీ కామెంట్స్

హీరో శివాజీ బిగ్ బాస్ 7 తెలుగులో కంటెస్టెంట్‌గా అలరించాడు. సుమారు 12 ఏళ్ల తర్వాత శివాజీ నటిస్తున్న వెబ్ సిరీస్ #90s. ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ఉపశీర్షిక. ఈటీవీ విన్ ఓటీటీలో జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ కానున్న #90s వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ శనివారం గ్రాండ్‌‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో ఏపీ రాజకీయాలపై హీరో శివాజీ కామెంట్స్ చేశాడు.

"చాలా మంది నేను ఏ పార్టీలో ఉన్నానంటూ అడుగుతున్నారు. నేను ప్రజల్లో ఉన్నానా, రాజకీయాల్లో ఉన్నానా అనేది ముఖ్యం కాదు. ఎందుకంటే ప్రజల్లో ఉంటే ప్రజల కోసం మాట్లాడతాం. కానీ రాజకీయాల్లో ఉంటే ఎవరో ఒకరిని తిట్టాల్సి వస్తుంది. నేను ఒకప్పుడు బీజేపీలో ఉన్నమాట నిజమే. కానీ, ఏపీ కోసం బీజేపీ ఇచ్చిన హామీలను విస్మరించడంతో ఆ పార్టీ నుంచి వచ్చేశాను. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలోనూ లేను" అని శివాజీ తెలిపాడు.

"కేవలం నేను ప్రజల గొంతుకగా ఉంటా అంతే. అయితే పదేళ్ల పాటు యువత భవిష్యత్తు, ప్రత్యేక హోదా కోసం పోరాడాను. కానీ, ఎన్నేళ్లని ఒంటిరిగా పోరాడుతూ ఉంటాను. నాకు ఒక ఫ్యామిలీ ఉంది. అందుకే నాకు ఏం లేనప్పుడు అన్నీ ఇచ్చిన సినిమాల వైపు నా జర్నీని తిరిగి మొదలుపెట్టా. ఆ సమయంలోనే బిగ్ బాస్‌లోకి వెళ్లాను" అని శివాజీ చెప్పుకొచ్చాడు.

"ఎన్నో ఏళ్లుగా పవన్ కల్యాణ్ రాజకీయాల్లో పోరాడుతున్నారు కదా. మరి ఆయనతో చేరొచ్చు కదా" అని మీడియా అడిగిన ప్రశ్నకు.. "ప్రజల్లో ప్రశ్నించే తత్వం పోయింది. పదేళ్ల పాటు నేను ఏపీ కోసం పోరాడాను. ఇక మెగాస్టార్ కుటుంబానికి ఏపీలో, తెలంగాణలోనూ భారీగా అభిమానులున్నారు. ఎవరికీ లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ వారికి ఉంది. సీఎం అవ్వాలంటే మెగా కుటుంబానికి పెద్ద కష్టమేమి కాదు. కానీ, ఎక్కడో లోపం ఉంది. దాన్ని సరిదిద్దుకుంటే ఆ కుటుంబంలో ఒకరు సీఎం అవ్వొచ్చు" అని శివాజీ సమాధానం ఇచ్చాడు.