Satyadev Brahmaji: 30 ఏళ్లుగా దాచుకున్న బ్రహ్మాజీ తెల్ల జుట్టు కనిపించింది.. నటుడిపై హీరో సత్యదేవ్ కామెంట్స్-hero satyadev comments on actor brahmaji in baapu movie pre release event says his white hair appears after 30 years ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Satyadev Brahmaji: 30 ఏళ్లుగా దాచుకున్న బ్రహ్మాజీ తెల్ల జుట్టు కనిపించింది.. నటుడిపై హీరో సత్యదేవ్ కామెంట్స్

Satyadev Brahmaji: 30 ఏళ్లుగా దాచుకున్న బ్రహ్మాజీ తెల్ల జుట్టు కనిపించింది.. నటుడిపై హీరో సత్యదేవ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Published Feb 19, 2025 05:54 PM IST

Satyadev Comments On Actor Brahmaji White Hair: టాలీవుడ్ పాపులర్ నటుడు బ్రహ్మాజీ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ బాపు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన హీరో సత్యదేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బ్రహ్మాజీ తెల్ల జుట్టుపై సత్యదేవ్ చేసిన ఫన్నీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

30 ఏళ్లుగా దాచుకున్న బ్రహ్మాజీ తెల్ల జుట్టు కనిపించింది.. నటుడిపై హీరో సత్యదేవ్ కామెంట్స్
30 ఏళ్లుగా దాచుకున్న బ్రహ్మాజీ తెల్ల జుట్టు కనిపించింది.. నటుడిపై హీరో సత్యదేవ్ కామెంట్స్

Satyadev Comments On Brahmaji White Hair: తెలుగులో పాపులర్ నటుడిగా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మాజీ. వివిధ సినిమాల్లో భిన్నమైన పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. అలాంటి వెర్సటైల్ యాక్టర్ బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా బాపు. తెలుగు డార్క్ కామెడీ డ్రామా చిత్రంగా రూపొందిన బాపుకు దయా దర్శకత్వం వహించారు.

బ్రహ్మాజీపై కామెంట్స్

బాపు సినిమా ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ (ఫిబ్రవరి 19) బాపు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో సత్యదేవ్‌తోపాటు అగ్ర దర్శకులు నాగ్ అశ్విన్, చందూ మొండేటి, బుచ్చిబాబు సాన, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ హాజరయ్యారు. బాపు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు బ్రహ్మాజీపై హీరో సత్యదేవ్ ఫన్నీ కామెంట్స్ చేశారు.

ఎవరికీ కనిపించకుండా

హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పడానికి రెండు మూడు రీజన్స్ ఉన్నాయి. 30 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా దాచుకున్న బ్రహ్మాజీ అన్న తెల్ల జుట్టు ఈ సినిమాలో కనిపించింది (నవ్వుతూ). కాబట్టి కచ్చితంగా ఈ సినిమా ఆడుతుంది. అంత నేచురల్‌గా చేశారు" అని ఫన్నీ కామెంట్స్ చేశారు. దాంతో స్టేజీపై ఉన్న వాళ్లంతా నవ్వేశారు.

రా ఎమోషన్ కనిపిస్తోంది

అనంతరం హీరో సత్యదేవ్ కొనసాగిస్తూ.. "బ్రహ్మాజీ అన్న తన భుజంపై వేసుకొని ప్రమోట్ చేశారు. బాపు మూవీ ట్రైలర్‌లో రా ఎమోషన్ కనిపిస్తోంది. టీమ్ అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.

బలగంతో ఎంతో ఆదరించారు

యాక్టర్ బలగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. "నేను సినీ పరిశ్రమకు కొత్తవాడిని. మల్లేశం నా మొదటి పిక్చర్. బలగంతో ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు బాపుతో వస్తున్నాం. మీ అందరి ప్రోత్సాహం కావాలి. ఈ సినిమా పది మందికి చూపించాల్సిందిగా కోరుకుంటున్నాను" అని తెలిపారు.

గొప్ప అనుభూతి పొందుతారు

"అందరికీ నమస్కారం. బాపు అద్భుతమైన కథ. ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడానికి నన్ను ఎంచుకున్న డైరెక్టర్ దయకి థాంక్ యూ. లిరిక్ రైటర్స్‌కి థాంక్ యూ. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సినిమాని చూసి ఆడియన్స్ గొప్ప అనుభూతిని పొందుతారు" అని మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ చెప్పుకొచ్చారు.

ఎప్పటి నుంచో తెలుసు

"బాపు సినిమాకి పని చేసిన అందరికీ థాంక్ యూ. ధ్రువన్ నాకు ఎప్పటినుంచో తెలుసు. బాపు సినిమా పెద్ద హిట్ కావాలని, అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని సంగీత దర్శకుడు భీమ్స్ అన్నారు.

మెస్మరైజ్ అయ్యాను

నిర్మాత భాను ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. "కిస్మత్ తర్వాత ఇది నా రెండో సినిమా. దయ ఈ కథ చెప్పినపుడు చాలా నచ్చింది. ఇంత అద్భుతమైన సినీ ప్రముఖులతో ఈ వేదిక పంచుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఇదొక గౌరవంగా భావిస్తున్నాను. నాగ్ అశ్విన్ గారి మహానటి చూసి మెస్మరైజ్ అయ్యాను. బ్రహ్మజీ గారి థాంక్ యూ. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు" అని వెల్లడించారు.

కథను నమ్మారు

"అందరికీ నమస్కారం. నాగ్ అశ్విన్ గారికి, చందు గారికి, బుచ్చిబాబు గారికి సత్యదేవ్ గారికి థాంక్ యూ. మా నిర్మాతలకు థాంక్ యూ. నా కథని నమ్మి నిర్మించారు. మా టీం అందరికీ పేరు పేరున థాంక్ యూ. బ్రహ్మాజీ గారి వలనే ఈ సినిమాకి ఇంత బజ్ క్రియేట్ అయింది. బాపు ప్రివ్యూస్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మీరంతా సినిమా చూసి పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను" అని డైరెక్టర్ దయ చెప్పారు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం