టాలీవుడ్‌లో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు రక్షిత్ అట్లూరి. పలాస 1978 మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో రక్షిత్ అట్లూరి లండన్ బాబులు, నరకాసుర, ఆపరేషన్ రావణ్ వంటి సినిమాలతో అలరించాడు. ఇప్పుడు రక్షిత్ అట్లూరి నటించిన లేటెస్ట్ మూవీ శశివదనే.
ఇప్పటివరకు యాక్షన్ థ్రిల్లర్స్ చేసిన రక్షిత్ అట్లూరి రొమాంటిక్ లవ్ స్టోరీగా శశివదనే సినిమాను చేశాడు. ఈ సినిమాలో రక్షిత్ అట్లూరికి జోడీగా బ్యూటిపుల్ కోమలి ప్రసాద్ హీరోయిన్‌గా చేసింది. శశివదనే సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు.
గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల శశివదనే సినిమాను నిర్మించారు. అక్టోబర్ 10న శశివదనే సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 4న శశివదనే చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్‌లో హీరో రక్షిత్ అట్లూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ .. "నాకు మూడేళ్ల క్రితం తేజ గారు ఈ కథ గురించి చెప్పారు. సాయి చెప్పిన కథ మొదట్లో నాకు నచ్చలేదు. ఆయనేం చెబుతున్నాడో కూడా అర్థం కాలేదు. కథగా అయితే అర్థం కాలేదు కానీ ఆయన చెప్పిన సీన్లు నచ్చాయి. ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్స్ కూడా చూశాను. ఇందులో ఆయన రాసుకున్నట్టుగా ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ ఇంత వరకు తెలుగులో రాలేదు" అన్నారు.
"శ్రీమాన్ గారు చేసిన పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. గోదావరి జిల్లాల్ని అద్భుతంగా చూపించిన సాయి కుమార్ పనితనం గురించి అందరూ చెప్పుకుంటారు. గౌరీ గారి క్యాస్టూమ్స్, శర్వా మ్యూజిక్, అనుదీప్ ఆర్ఆర్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. కోమలి గారు అద్భుతమైన నటి. తేజ గారికి, అభిలాష్ గారికి మంచి సక్సెస్ రావాలి" అని రక్షిత్ అట్లూరి తెలిపాడు.
"సాయికి డైరెక్టర్‌గా మంచి పేరు రావాలి. కెమెరామెన్ సాయి గారికి ఆల్రెడీ ప్రశంసలు వస్తున్నాయి. అశ్లీలతకు తావు లేకుండా నిజాయితీగా ఓ మంచి సినిమాను చేశాం. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆనందంతో బయటకు వస్తారు. ఏ ఒక్కరినీ నిరాశ పరచదు అని మాత్రం చెప్పగలను. అక్టోబర్ 10న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి" అని రక్షిత్ అట్లూరి పేర్కొన్నాడు.
సంబంధిత కథనం