Telugu News  /  Entertainment  /  Hero Prabhas Attend Ravan Dahan Event Lav Kush Ramlila
రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్
రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్ (Twitter)

Prabhas at Ravan Dahan: రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్.. ఈవెంట్ విజయవంతం

05 October 2022, 22:03 ISTMaragani Govardhan
05 October 2022, 22:03 IST

Prabhas Attend Ravan Dahan: విజయదశమి సందర్భంగా దిల్లీలోని లవ్ కుశ్ రామ్ లీల వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభాస్ సందడి చేశారు. రావన దహన కార్యక్రమంలో పాల్గొని విజయంవంతం చేశారు.

Prabhas at Ravan Dahan: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ మాములుగా లేదు. దక్షిణాది స్టార్లలో ఉత్తరాదిన విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ప్రభాస్ ముందు వరుసలో ఉంటారు. అందుకే రావణ దహన కార్యక్రమానికి మన రెబల్ స్టార్‌కు ఆహ్వానం జరిగింది. విజయదశమి సందర్భంగా దిల్లీలోని లవ్ కుశ్ రామ్ లీల వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభాస్ సందడి చేశారు. రావన దహన కార్యక్రమంలో పాల్గొని విజయంవంతం చేశారు. ఆయనను చూసేందుకు వేలాది మందిగా అభిమానులు మైదానం వద్దకు చేరుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ కార్యక్రమమంలో ప్రభాస్ ధనస్సుతో బాణాన్ని విడిచి రావణుడిని దహనం చేశారు. ఈ సమంయలో అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు చేయడంతో రామ్ లీలా మైదనామంతా హోరెతెత్తింది. భారత సంస్కృతి పట్ల ప్రభాస్‌కు ఉన్న అంకిత భావం చూసే ఆయనను ముఖ్య అతిథిగా పిలిచినట్లు లవ్ కుశ్ రామ్ లీలా కమిటీ అధ్యక్షుడు అర్జున్ కుమార్ తెలిపారు.

రామ్‌లీలా మైదానంలో విజయదశమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. అయితే కొవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా ఈ రావణ దహనం కార్యక్రమం జరగలేదు. దీంతో ఈసారి ఈ వేడుకలను మరింత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. "ఈసారి పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తాం. మరింత మంది వచ్చి చూసేలా ఏర్పాట్లు చేశాం. అందుకే 22 మంది సెలబ్రిటీలను ఆహ్వానించాం. వాళ్లంతా రామ్‌లీలాకు రానున్నారు. ప్రభాస్‌ను గెస్ట్‌గా పిలవడానికి కూడా ఇదే కారణం" అని అర్జున్‌కుమార్‌ తెలిపారు.

రామ్ లీలా మైదానంలో ఆదిపురుష్ టీమ్ సందడి చేసింది. ప్రభాస్‌తో పాటు దర్శకుడు ఓం రౌత్, టీ సిరీస్ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అభిమానులతో ఫొటోలు దిగడంతో పాటు వాళ్లిచ్చిన బహుమానాలు స్వీకరించాడు ప్రభాస్. రావణ దహనం కార్యక్రమం తర్వాత ఆదిపురుష్ టీజర్‌ను కూడా ప్రదర్శించారు.